Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముర్ముకు మద్దతుతో డోర్స్ ఓపెన్ - చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ : సీఎం జగన్ అలర్ట్..!!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలు..ఇప్పుడు తిరిగి చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల వేళ చివరి నిమిషం వరకు మౌనం పాటించిన టీడీపీ..ఆకస్మికంగా తన వ్యూహం బయట పెట్టింది. ఎన్డీఏ అభ్యర్ధికే తమ మద్దతు అని ప్రకటించింది. సీఎం జగన్ తో పాటుగా ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించి..సామాజిక న్యాయం లో భాగంగా ముర్ముకు సపోర్ట్ చేస్తున్నట్లు టీడీపీ వెల్లడించింది. కానీ, టీడీపీ అధినేత అసలు లక్ష్యం టార్గెట్ జగన్.

టీడీపీ - బీజేపీ కలుస్తాయా

టీడీపీ - బీజేపీ కలుస్తాయా

2019 ఎన్నికల వేళ ఎన్డీఏ తో దూరం తరువాత జరిగిన నష్టాన్ని టీడీపీ నేతలు గ్రహించారు. నాడు జగన్ ట్రాప్ లో చిక్కుకున్న టీడీపీ..ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇక, జగన్ పూర్తి స్థాయిలో బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల వేళ..జగన్ కు వారి నుంచి మద్దతు లేకుండా చేయటం ఇప్పుడు టీడీపీ అధినేత అసలు లక్ష్యం. పొత్తుల్లో భాగంగా తిరిగి బీజేపీ - జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలనేది ఆలోచన. బీజేపీ అగ్ర నేతల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సానుకూల సంకేతాలు లేవు. అయినా, వచ్చే ఎన్నికలు కీలకంగా భావిస్తున్న చంద్రబాబు రాజకీయంగా ముందుడుగు వేసారు. బీజేపీ కోరకపోయినా.. సామాజిక న్యాయం పేరుతో గిరిగిజ మహిళ అయిన ముర్ముకు మద్దతు ప్రకటించారు.

చంద్రబాబు తొలి అడుగుతో

చంద్రబాబు తొలి అడుగుతో


సీఎం జగన్ ముర్ముకు అతిధ్యం ఇచ్చిన నాడే..చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా ముర్ముకు తన మద్దతు ప్రకటించారు. ఇక, బీజేపీ ముఖ్యనేతలతో తిరిగి సంబంధాల దిశగా తొలి అడుగు సక్సెస్ అయినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ - బీజేపీ తిరిగి మిత్రపక్షాలుగా కాకపోయినా, జగన్ - కేంద్రంలోని ముఖ్య నేతల సత్సంబంధాలు కొనసాగితే.. పరోక్షంగా ఎన్నికల వేళ అనేక రకాలుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో..నాడు 2019 ఎన్నికల సమయంలో జగన్ చేసిన రాజకీయమే ఇప్పుడు..చంద్రబాబు మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ముర్ము ఎంపిక పైన చంద్రబాబు ప్రధాని మోదీని అభినందించారు. తాము అడగకపోయినా, తమ అభ్యర్ధికి చంద్రబాబు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం కలిగించారు. ఈ నిర్ణయం పైన వైసీపీ సైతం తప్పు బట్టలేని పరిస్థితి.

చంద్రబాబు టార్గెట్ జగన్

చంద్రబాబు టార్గెట్ జగన్

అయితే, చంద్రబాబు వ్యూహం కు కౌంటర్ ఇచ్చేలా సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. టీడీపీకి కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు మద్దతుగా నిలిచే అవకాశం లేదనేది వైసీపీ కీలక నేతల అంచనా. ఒక వేళ, మరోసారి బీజేపీ - టీడీపీ దగ్గరైనా తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడేళ్లుగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వంగా సత్సంబంధాలు కొనసాగించామని చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో ఇక, టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీకి మద్దతుగా ఢిల్లీలో ఎన్ని రకాల ఎత్తులు వేసినా.. ప్రధాని మాత్రం టీడీపితో మైత్రికి సిద్దంగా లేరంటూ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఏపీలో ఇప్పటికే ఎన్నకల మూడ్ కనిపిస్తోంది.

సీఎం జగన్ అలర్ట్ - ఢిల్లీ కేంద్రంగా

సీఎం జగన్ అలర్ట్ - ఢిల్లీ కేంద్రంగా

రాష్ట్రంలో ఎత్తులు పై ఎత్తులతో ఓట్ల కోసం రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్న టీడీపీ - వైసీపీ అధినేతలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఓట్ల పరంగా ఏపీలో కేంద్రంలోని ముఖ్యులు ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ, పరోక్షంగా అనేక సమీకరణాలు ఇప్పుడు చర్చకు కారణమవుతున్నాయి. దీంతో.. ఇటు అమరావతి.. అటు ఢిల్లీ కేంద్రంగా సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు వేసే రాజకీయ అడుగులు ఏపీలో రానున్న ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+