ఎమ్మెల్యే శ్రీదేవి దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా ? కావాలనే వైసీపీ కులాల కార్చిచ్చు .. చంద్రబాబు ఫైర్
ఉండవల్లి శ్రీదేవి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు శ్రీ దేవి టీడీపీ నేతలను, చంద్రబాబుని దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఇక తాజాగా చంద్రబాబు ఎమ్మెల్యే శ్రీదేవి ఎపిసోడ్ పై సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు . వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఇకపోతే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

ఎస్సీ స్థానం క్రిస్టియన్ కు కేటాయిస్తే ఎస్సీలే ప్రశ్నిస్తున్నారు .. సమాధానం ఏంటి అన్న చంద్రబాబు
ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరకాటంలో పడేశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలనే బేస్ గా చేసుకుని చంద్రబాబు వైసీపీ పై విరుచుకుపడ్డారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని చెప్పిన శ్రీదేవిని , వైసీపీ దళిత మహిళగా చూపి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు శ్రీదేవికి కట్టబెట్టి అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలే నిలదీస్తున్నారని దానికి వైసీపీ సమాధానం ఏంటి అని చంద్రబాబు మండిపడ్డారు. "తాను క్రిస్టియన్ అని, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెప్తే వైసీపీవాళ్ళు దళితమహిళగా రాజకీయం చేస్తున్నారు. తెదేపావారిపై తప్పుడుకేసులు పెడుతున్నారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు క్రిస్టియన్ కు కట్టబెట్టి, అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలే నిలదీస్తుంటే మీ జవాబేంటి?" అని ట్వీట్ చేశారు చంద్రబాబు

మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ సిద్ధాంతం అన్న బాబు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీకి అలవాటని విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు చేసిన ట్వీట్ చూస్తే "మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం వైసీపీ పుట్టుకతో వచ్చిన సిద్ధాంతం. బలహీనవర్గాల కోసం, సామాజికన్యాయం కోసం పుట్టిన పార్టీ తెదేపా. వైసీపీలాగా కులరాజకీయాలు చేయడం తెదేపా సంస్కృతి కాదు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిగారి విషయంలో వైసీపీ కావాలనే కులాల కార్చిచ్చు రగిలిస్తోంది." అంటూ ఆయన పేర్కొన్నారు

వినాయకచవితి రోజు ఎమ్మెల్యే శ్రీదేవిపై కులవివక్ష వ్యాఖ్యల ఎపోసోడ్
వినాయక చవితి పండుగ నాడు దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వినాయకుడికి పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని టీడీపీ నాయకులు కుల వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం ఏపీ లో కలకలం రేపింది. కన్నీరు పెట్టుకున్న శ్రీదేవి తనపై చేసిన కులవివక్ష వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసి, సదరు వ్యక్తుల ను కఠినంగా శిక్షించాలని కోరారు.దీనిపైన వెంటనే స్పందించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. అందులో భాగంగా శ్రీదేవి పై దూషణలు చేసిన నలుగురు టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసే పనిలో పడ్డారు.

ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలే ఆయుధంగా ఎదురు దాడి చేస్తున్న టీడీపీ
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు శివయ్య ను అరెస్ట్ చేసిన పోలీసులు, మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇక ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబుకే కాదు ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ ఆయుధం అయ్యింది.
ఇక ఇంతకీ శ్రీదేవి ఏమన్నారంటే తన భర్త కాపు కులానికి చెందిన వారిని, ఇక తాను క్రిస్టియన్ అని శ్రీదేవి తెలిపింది. అయితే ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన తాడికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీ గా ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఇప్పుడు తను క్రిస్టియన్ అని చెప్పడం ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం అయ్యింది. చంద్రబాబు అభిప్రాయాలు వ్యక్తం చెయ్యటమే కాదు ఈ వ్యవహారంలో టీడీపీ న్యాయపోరాటం చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు చంద్రబాబు వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications