ఎన్నికల టెన్షన్ కు దూరంగా మనవడు దేవాన్ష్ తో కలిసి ఆడుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల టెన్షన్ ను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 110 ప్రచార సభల్లో తీరిక లేకుండా పరిశ్రమించిన చంద్రబాబు పోలింగ్ కు సమయం దగ్గర పడుతుంటే ఆ టెన్షన్ ను అధిగమించటానికి నారా దేవాన్ష్ తో ఆడుతూ టెన్షన్ నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నోటిపికేషన్ వెలువడినప్పటి నుండి ఎండను సైతం లెక్క చెయ్యకుండా తీరిక లేకుండా ప్రచార సభల్లో పాల్గొన్నారు చంద్రబాబు . టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభ్యర్థుల ఎంపిక నుండి మంగళవారం ప్రచారం ముగిసేవరకు కుటుంబానికి దూరమైన ఆయనకు ఇప్పుడు కాస్త తీరిక సమయం దొరికింది. దీంతో ఈ సమయం మొత్తాన్ని ఆయన తన కుటుంబంతోనే గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా తన ముద్దుల మనవడు దేవాన్ష్ తో సరదాగా గడుపుతూ ఈ ఎన్నికల టెన్షన్స్ కు దూరంగా వుండే యత్నం చేస్తున్నారు .

Chandrababu Playing Games With grandson Nara Devansh to avoid election tension

ఇలా మనవడు నారా దేవాన్ష్ తో చంద్రబాబు సరదాగా గార్డెన్ లో ఆడుకుంటున్న ఫోటోను నారా లోకేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ''ప్రజా విజయం కోసం అనుక్షణం ప్రజలతో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచార సభలలో పాల్గొన్న @ncbn గారికి, కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. ఇదిగో ఇలా తాతామనవళ్ళు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తానికి చంద్రబాబు మనవడితో సరదాగా గడుపుతూ కాస్త పోలింగ్ టెన్షన్ నుండి ఊరట పొందుతున్నారని చెప్పొచ్చు .అయితే ఇంత టెన్షన్ సమయంలో చంద్రబాబు మనవడితో ఆడుతున్న దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+