నాగబాబుకు మంత్రి పదవిపై చంద్రబాబు మరో ట్విస్ట్..?

ఏపీలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఉగాదికి మంత్రి కాబోతున్నారంటూ గత కొంతకాలంగా తీవ్ర స్ధాయిలో ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఆయనకు తాజాగా ఎమ్మెల్సీని కూడా చేసింది. దీంతో ఇక మంత్రి పదవి ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న సమయంలో చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబును కేబినెట్లోకి తీసుకునే కార్యక్రమం కాస్తా మరోసారి వాయిదా పడిందట.

జనసేనలో కీలక నేతగా ఉన్న నాగబాబును తన కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు చాలా కాలం క్రితమే ప్రకటన విడుదల చేశారు. దీంతో నాగబాబును ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తప్పకుండా కేబినెట్లోకి తీసుకుని మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ అలా జరగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నాగబాబు ఎమ్మెల్సీ అయిపోయినా మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం ఓ అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది.

Chandrababu postpones nagababu s inclusion in cabinet after ugadi festival

సీఎం చంద్రబాబు ఈ ఉగాదికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే దీని ప్రభావంతో దానిపై ఫోకస్ అంతా పోతుందని కొందరు ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే కార్యక్రమాన్ని స్వల్ప గడువుతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అయితే నాగబాబును మంత్రిని చేసే విషయంలో మాత్రం చంద్రబాబు వెనక్కి తగ్గే అవకాశాలు లేవని సమాచారం. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+