మోడీకి బాబు కితాబు, 'జగన్ తీరు వల్ల ఇతర రాష్ట్రాల్లో ఏపీ చులకన'

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. విశాఖలో బ్రిక్స్ పట్టణాభివృద్ధి మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ విదేశాల్లో పర్యటించి దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు.

మోడీ నాయకత్వంలో దేశం ముందుకు పోతోందన్నారు. 2050 నాటికి పట్టణాల్లోనే జనాభా అత్యధికంగా ఉంటుందని చెప్పారు. 2022 నాటికి భారత దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో టాప్ 3లో ఒకటిగా ఏపీ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.

తాము విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకొని పైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో పట్టణ ప్రణాళికలు సరిగ్గా లేకపోవడంతో అభివృద్ధి జరగలేదన్నారు. దేశాభివృద్ధిలో పట్టణీకరణే కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పట్టణీకరణలో ప్రధానంగా కాలుష్యం, మురికవాడల సమస్య ఎదురవుతోందన్నారు.

Chandrababu Naidu

జగన్ పార్టీ పైన రావెల కిషోర్ బాబు ఆగ్రహం

నేరగాళ్లతో నిండిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవిత్రమైన శాసనసభలోనూ అరాచకం సృష్టించిందని మంత్రి రావెల కిషోర్ బాబు వేరుగా మండిపడ్డారు. వైసిపి అధినేత జగన్‌ తరహాలోనే మిగతా సభ్యులు నడుస్తున్నారన్నారు.

వైసిపి సభ్యుల ప్రవర్తనతో ఏపీ ఇతర రాష్ట్రాల ముందు చులకన అయిపోతోందన్నారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. శాసనసభలో అనుచితంగా ప్రవర్తించిన అందరు సభ్యులపైనా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ప్రత్యేక హోదా అంశం చర్చకు రాకుండా చేయాలన్నదే వైసిపి ఉద్దేశమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+