విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెడికల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు(పిక్చర్స)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మూడు రోజులపాటు జరిగే సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెన్షనల్ ఎండొస్కోపీ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఇఐ) 16వ వార్షిక సదస్సు శుక్రవారం విశాఖలో ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ప్రసంగించారు.

రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవలను అందించాలన్న సంకల్పంతో పలు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రలో తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందుతుతున్నాయని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల ద్వారా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎస్‌జిఇఐ అధ్యక్షుడు పంకజ్ థవన్ మాట్లాడుతూ.. నిరుడు దేశంలో 90 లక్షల ఎండోస్కోపీ, 80 లక్షల కొలనోస్కోపీ సర్జరీలు చేశామని చెప్పారు.

ఎస్‌జిఇఐ కార్యదర్శి మహేష్ గోయంక మాట్లాడుతూ ఎండోస్కోపిక్ సెంటర్లకు ఎక్రిడిడేషన్ ఇచ్చే విధానాన్ని రెండేళ్ళ నుంచి ప్రారంభించామని చెప్పారు. ఇండియన్ కాలేజ్ ఆఫ్ డైజెస్టికల్ ఎండోస్కోపీని నిరుడు ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇ పెదవీర్రాజు, పి మురళీకృష్ణ, వి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

చంద్రబాబు

చంద్రబాబు

మూడు రోజులపాటు జరిగే సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెన్షనల్ ఎండొస్కోపీ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఇఐ) 16వ వార్షిక సదస్సు శుక్రవారం విశాఖలో ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ప్రసంగించారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవలను అందించాలన్న సంకల్పంతో పలు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రలో తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందుతుతున్నాయని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వైద్య రంగంలో పెట్టుబడులకు ఆంధ్రలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానంలో వైద్యసేవలు అందించడానికి ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రపంచంలోని అనేక దేశాల్లో వైద్యులు, నర్స్‌లు, పారామెడికల్ సిబ్బంది కొరత ఉందని, ఇక్కడ మానవవనరులు అధికంగా ఉన్నాయని, వీరికి శిక్షణ ఇస్తే, దేశ విదేశాల్లో పనిచేయడానికి ఉపయోగపడతారని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల ద్వారా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

English summary
Chief Minister Nara Chandrababu Naidu has called upon the doctors and health institutions to cooperate with the state government in its efforts to develop Andhra Pradesh as a medical hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X