సోషల్ పోస్టులపై ఏపీ సర్కార్ కొరడా..! త్వరలో చట్టం, నిజ నిర్ధారణ కమిటీ..!
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న పోరుకు సోషల్ మీడియా కేంద్రంగా మారుతోంది. అధికారంలో ఉన్న పార్టీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాల్ని తెరపైకి తీసుకురావడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇప్పుడు అలాంటి సోషల్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఓ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తోంది.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని, దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తెస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే గాక అభధ్రతా భావానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం తెస్తామన్నారు.

దీంతో పాటు ప్రత్యేకంగా ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాస్తవాలేమిటో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుందని హోంమంత్రి అనిత ప్రకటించారు. అమరావతి మునిగిపోయిందని విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్లు పనిచేయడం లేదని పలు అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన ప్రసారం చేస్తూ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని, ఇకపై అలాంటి తప్పుడు వార్తల ప్రసారాలను సమర్ధవంతంగా తిప్పకొట్టడంతోపాటు అందుకు కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు అనిత తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ విజయవంగా అమలు చేయడంతో ప్రతిపక్షపార్టీ తట్టులేక పోతోందని అందుకే సోషల్ మీడియా వేదికగా దుప్ప్ర్రచారాన్ని చేస్తోందని హోం మంత్రి అనిత మండిపడ్డారు. ఇది ఆపార్టీకి వారసత్వంగా వచ్చిన సమస్యగా ఉందన్నారు. ఒక్క ఆగష్టు నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,నేతన్నలకు,నాయి బ్రాహ్మణులకు 200 వరకూ ఉచిత విద్యుత్,స్త్రీశక్తి పధకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు. అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసని అలాంటి శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
-
ఈ పొదల మాటున నక్కిన భయంకర జంతువును గుర్తించగలరా? -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
జగన్ సన్నిహిత అధికారితో రహస్య భేటీ, ప్రభుత్వం సీరియస్- ఐఏఎస్ పై వేటు..!! -
ఈ అడవిలో దాగి ఉన్న చిన్న ఎలుగుబంటి ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
నిన్ను డ్రమ్ములో ప్యాక్ చేస్తా: భార్య బెదిరింపులకు భర్త షాకింగ్ నిర్ణయం -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..?












Click it and Unblock the Notifications