పదేళ్లలో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లాం: చంద్రబాబు
హైదరాబాద్: కాంగ్రెసు పదేళ్ల పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లామని ఆయన అన్నారు. సాధారణ పరిపాలనపై ఆయన బుధవారం సాయంత్రం శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి, దుష్పరిపాలన వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిందని ఆయన అన్నారు. కరెంట్ తాము వచ్చిన తర్వాత నియంత్రణలోకి తెచ్చామని ఆయన చెప్పారు.
సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, సహజ వనరులతో పాటు మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. సెజ్‌లను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నారని ఆయన విమర్సించారు. వాన్‌పిక్, లేపాక్షి వంటివాటి విషయంలో ఇలానే చేశారని ఆయన చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు బ్యాంకుల్లో పెట్టి అప్పులు తీసుకుని వాటితో వ్యాపారాలు చేశారని ఆయన అన్నారు. ప్రజల ఆస్తులతో, జీవితాలతో ఆడుకున్నారని, లూటీ చేశారని ఆయన అన్నారు.
బొగ్గు వంటి విలువ వచ్చిన సహజ వనరులను లూటీ చేశారని ఆయన అన్నారు. సుపరిపాలనకు ప్రజల భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిస్థితి కాంగ్రెసు పాలనలో అధ్వాన్నంగా తయారైందని ఆయన అన్నారు. మహిళలపై నేరాలు పెరిగాయని ఆయన చెప్పారు. అందరికీ ఫలితాలు అందాలంటే దూరదృష్టి ఉండాలని ఆయన అన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులను పూర్తి చేసే విధంగా వ్యవహరించలేదని ఆయన అన్నారు.

రాజకీయ హత్యలు వందలాదిగా జరిగాయని, పరిటాల రవీంద్రను పథకం ప్రకారం జరిగిందని ఆయన అన్నారు. బరితెగించి రాజకీయ హత్యలు చేశారని ఆయన అన్నారు. వైట్ కాలర్స్ నేరాలు పెరిగాయని ఆయన అన్నారు. జైల్లో కూడా వరుసగా హత్యలు జరిగాయని ఆయన అన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని తాను ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. ఉగ్రవాద చర్యలు కూడా వరుసగా జరిగాయని ఆయన అన్నారు. పోలీసు అధికారులను ఇష్టానుసారంగా వేశారని, మాఫియా ఇష్టానుసారంగా తయారైందని ఆయన అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు పాతుకుపోయారని ఆయన అన్నారు.
కాంగ్రెసు పాలనలో ప్రాధాన్యతలు లేకుండా డబ్బుల కోసం కాంట్రాక్టులు ఇచ్చారని, మొబిలైజేషన్ ఫండ్స్ ఇచ్చారని, వాటిని వసూలు చేసే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనలో నీటి పారుదల వ్యస్థ భ్రష్టు పట్టిందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాలువలు తవ్వి, ఆనకట్టలు కట్టలేదని, దాంతో ఆయకట్టు తగ్గిపోయిందని ఆయన అన్నారు. పదేళ్ల కాంగ్రెసు పాలనలోని అవినీతి వల్ల ధరలు పెరిగాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications