బీజేపీతో కలిసి జగన్, కేసీఆర్, పవన్ కుట్రలు: ‘కత్తి దాడి’పై చంద్రబాబు
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి ఘటనపైనా స్పందించారు. కేసీఆర్‌కే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?: మోడీపై చంద్రబాబు నిప్పులు

జగన్‌పై అభిమాని దాడి చేస్తే మమ్మల్నంటారా?
‘విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేతపై ఓ వ్యక్తి చిన్న కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాం. సీఐఎస్ఐ ఆధీనంలోని విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో మాకు సంబంధం లేదు. నిందితుడు రాసిన 10పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని. అయితే బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏంటి?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

బాధ్యత లేకుండా జగన్..
‘దాడి జరిగిన తర్వాత ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. జగన్మోహన్ రెడ్డి నేరుగా విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అక్కడే చికిత్స తీసుకున్నారు. జగన్ బాధ్యత లేకుండా వ్యవహరించారు' అని చంద్రబాబు మండిపడ్డారు.

మాపై విమర్శలా?
‘జగన్‌పై దాడి జరిగితే ఏపీ డీజీపీని గవర్నర్ ఎలా నివేదిక అడుగుతారు? బీజేపీ నేతలు జీవీఎల్, కన్నా లాంటి వారు తమ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం' అని చంద్రబాబు ప్రశ్నించారు.

బీజేపీతో కలిసి జగన్, కేసీఆర్, పవన్ కుట్రలు
ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ కుట్రలు పన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు. అంతేగాక, తెలంగాణలో కేసీఆర్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాను కేంద్రంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరిన్ని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అన్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications