కేసీఆర్‌కే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?: మోడీపై చంద్రబాబు నిప్పులు
Recommended Video

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి వెనక్కు తీసుకుందని మండిపడ్డారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు సృష్టిస్తారా?
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను సమావేశ పరిచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా.. ప్రధానియే సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

రూపాయి అందలేదు
ఏపీకి ఎలాంటి సాయం చేయలేదని, రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్రంపై మండిపడ్డారు చంద్రబాబు. విద్యాసంస్థలను కూడా ఏర్పాటు చేయలేదని, విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్వేను ఏర్పాటు చేయలేదన్నారు. విభజన చట్టంలోని హామీలను పక్కనపెట్టారని కేంద్రంపై మండిపడ్డారు.

తెలంగాణ సీఎంకే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?
తెలంగాణ సీఎంకే మెచ్యూరిటీ ఉందని ప్రధాని వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ సీఎంకే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా? అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో తాను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని, హైదరాబాద్, సైబరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశానని తెలిపారు.

ఏపీని ఆదుకోరా?
కేరళలో వరదలతో తీవ్ర నష్టం వస్తే కేంద్రం ఆదుకోలేదని, ఏపీలో కూడా హుధుద్, ఇటీవల టిట్లీ తుఫానుతో నష్టం జరిగినా కేంద్రం ఎలాంటి సాయం అందించలేదని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ రాష్ట్రానికి వచ్చినా బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు కానీ, తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications