రొమాన్స్‌తో హీటెక్కించే మూవీ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ.. ఘాట్ స్టార్ట్ !!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ అందాల భామ, కెరీర్ ఆరంభం నుంచే స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సహా పలు భాషల్లో సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. లవ్ స్టోరీస్, యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు... జానర్ ఏదైనా సరే తమన్నా తన నటనతో ప్రత్యేక ముద్ర వేసింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తెలుగులో సినిమాలు కాస్త తగ్గించినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. గతేడాది 'ఓదెల 2' తో విజయాన్ని అందుకున్న తమన్నా.. కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. కోలీవుడ్‌లో విశాల్ నటిస్తున్న "పురుషన్" సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాలు, ఐటం సాంగ్ లలో చేస్తూ బిజీగా ఉంది. లేటెస్ట్ గా ఈ స్టార్ హీరోయిన్ ఒక క్రేజీ అప్‌డేట్‌తో తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

కాగా హిందీలో భారీ విజయాన్ని అందుకున్న హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ "రాగిణి ఎంఎంఎస్" 3 లో నటించనున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా దీనిపై వస్తున్న ప్రచారానికి తెరదించుతూ.. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కినట్లు స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షూటింగ్ స్పాట్ నుంచి 'రాగిణి 3' క్లాప్‌బోర్డ్ ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో రావడంతోనే వైరల్‌గా మారడమే కాకుండా.. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. శశాంక్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్ , శోభా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక రాగిణి ఎంఎంఎస్ మొదటి భాగంలో రాజ్‌కుమార్ రావ్, కైనాజ్ మోటివలా జంటగా నటించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో 2014లోసన్నీ లియోన్ ప్రధాన పాత్రలో సీక్వెల్ 'రాగిణి ఎంఎంఎస్ 2'ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ మూవీ లోని బేబీ డాల్ ఐటెం సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడో భాగంలో తమన్నా నటిస్తుండటంతో.. ఈసారి కూడా గ్లామర్ ట్రీట్ పక్కా అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.












Click it and Unblock the Notifications