భారత్ బుల్లెట్ రైలు లేటు వెనుక ? జపాన్ మాజీ మంత్రి షాకింగ్ -కేంద్రం రియాక్షన్..!

భారత్ లో ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు (bullet train) నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే జపాన్ సహకారంతో చేపడుతున్న ఈ పనులు అనుకున్న విధంగా కాకుండా దారి తప్పుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక ఓ కేంద్రమంత్రితో పాటు పలువురు అధికారులు ఉన్నారంటూ జపాన్ మాజీ మంత్రి ఒకరు చేసిన విమర్శలు కలకలం సృష్టించాయి. దీనిపై కేంద్రం ఇవాళ వివరణ ఇచ్చింది.

విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
విశాఖ-బెంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

జపాన్ షింకన్సెన్ హై-స్పీడ్ రైల్వే తరహాలో భారత్ లో నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యానికి మన అధికారులే కారణమని ఆ దేశ మాజీ మంత్రి ఒకరు ఆరోపించారు. రెండు రోజుల క్రితం చేసిన ట్వీట్ లో భారతదేశ ప్రతిష్టాత్మక హై-స్పీడ్ రైలు కారిడార్లో పురోగతి కొరవడిందని జపాన్ మాజీ మంత్రి మకిహారా ఆరోపించారు. ఈ జాప్యానికి పూర్తిగా భారతే కారణమని పేర్కొన్నారు. టోక్యోకు చెందిన ఒక బిజినెస్ న్యూస్ పోర్టల్‌లో, జపాన్‌కు చెందిన సీనియర్ రైల్వే ఇంజనీర్, ఢిల్లీకి చెందిన మెట్రో వాహన కన్సల్టెంట్ అయిన ఇసావో సుజిమురా రాసిన ఒక అభిప్రాయ వ్యాసానికి ప్రతిస్పందనగా మకిహారా ఈ కామెంట్స్ చేశారు. భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్టు షింకన్సెన్ నమూనా నుంచి గణనీయంగా పక్కకు మళ్లిందని సుజిమురా ఆరోపించారు.

Bullet Train Project on Course Says Govt Amid Japan Ex-Minister s Criticism
Visakhapatnam: విశాఖ-విజయనగరం-పలాస ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్లన్నీ..!
Visakhapatnam: విశాఖ-విజయనగరం-పలాస ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్లన్నీ..!

ఈ ఆరోపణలను భారత్ ఇవాళ తోసిపుచ్చింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై చర్చల సందర్భంగా అధికారులు పదేపదే తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని, స్వప్రయోజనాల"కే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ భారత్ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడెకి మకిహారా చేసిన ఆరోపణల్ని విదేశాంగశాఖ తిరస్కరించింది. అది ఒక వ్యక్తిగత అభిప్రాయం, వాస్తవాలకు గణనీయంగా భిన్నంగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ క్లారిటీ ఇచ్చారు. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలుపై భారత్-జపాన్ చర్చల్లో పురోగతి ఉందని, జపాన్ E20 రైలు శ్రేణిని అందిస్తుంది, కానీ అది 2030ల ప్రారంభంలో మాత్రమే అన్నారు. ఈ రైలు అభివృద్ధి దశలో ఉందని జైస్వాల్ స్పష్టం వెల్లడించారు. ఈ మేరకు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు జైస్వాల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+