శ్రీశైలం మీదుగా బుల్లెట్ రైలు ప్రతిపాదన.. గంటలోనే హైదరాబాద్ నుండి శ్రీశైలం జర్నీ!

శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు శ్రీశైలం మీదగా బుల్లెట్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించడం శ్రీశైలం మల్లన్న భక్తులకు నిజంగానే శుభవార్త. కేంద్రానికి బుల్లెట్ రైలు కోసం ప్రతిపాదన చేసిన తెలంగాణా ప్రభుత్వ ఆలోచన అమలైతే భక్తులు, సాధారణ ప్రయాణికులు శ్రీశైలం వెళ్ళటం బుల్లెట్ స్పీడ్ జర్నీ అవుతుంది.

హైదరాబాద్ నుండి శ్రీశైలం కేవలం గంటలోనే చేరుకునే అవకాశం

ప్రస్తుతం హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది కానీ బుల్లెట్ రైలు వస్తే ఆ ప్రయాణ సమయం కాస్త తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న సమయం కంటే అతి తక్కువ సమయంలో ప్రయాణం చేయగలుగుతాం. ముఖ్యంగా హైదరాబాద్ నుండి శ్రీశైలం కేవలం గంటలోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరకు వెళ్లే లక్షలాది మంచి భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

bullet train via srisailam proposal to Centre for bullet train route from Hyderabad to Bengaluru

ఈ మార్గంలో బుల్లెట్ రైలు మార్గం .. కొత్త ప్రతిపాదన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులతో సమావేశం నిర్వహించి ఈ మార్పులను ప్రతిపాదించారు. శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదగా బెంగళూరుకు వెళ్లేలా కొత్త అలైన్మెంట్ ను సూచించారు. ఇది ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించడమే కాకుండా, పర్యాటక, ఆర్థిక, ఉపాధి అవకాశాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు

తెలంగాణ రాష్ట్రంలో 218 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ రైల్వే ట్రాక్

ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రంలో 218 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ఉండనుంది. ఈ రూట్లో 3 రైల్వే స్టేషన్ లను ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు ప్రకటించిన మార్గం శంషాబాద్, మహబూబ్నగర్, కర్నూలు మీదుగా ఉండగా, ప్రస్తుతం తాజా ప్రతిపాదన శ్రీశైలం మీదుగా మార్చాలని సూచించారు. ఇటువంటి మార్పులే హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ మార్గం లో కూడా చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది.

ఈ మార్గంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాంత దశ తిరిగినట్టే

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సర్వే, డిపీఆర్ దశలో ఉంది . రాష్ట్రం సూచించిన మార్పులను కేంద్ర అంగీకరిస్తుంది అని భావిస్తున్నారు. ఈ కొత్త మార్గం అమలు అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతం అన్ని విధాలుగా పురోగతికి ఈ ప్రాజెక్టు కారణమవుతుంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+