హైకోర్టులో అడ్డంగా బుక్కయిన విజయ్ సర్కార్- 100 కోట్ల ఆలయ స్కాంలో..!

తమిళనాడులో ₹100 కోట్ల పళని మురుగన్ ఆలయ భూ కుంభకోణంపై (Palani Temple Land Scam) కొనసాగుతున్న దర్యాప్తు, రిజిస్ట్రేషన్ విభాగంలోని అంతర్గత అవకతవకలను బయటపెడుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో నాటకీయ మలుపు తీసుకుంది. ఈ స్కాంలో సస్పెండ్ అయిన కొడైకనాల్ తాత్కాలిక సబ్-రిజిస్ట్రార్ జస్టిన్ మణికందన్ ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా, డిఫెన్స్, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య జరిగిన వాదనల్లో మరో కొత్త అధికారి ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, హైకోర్టు నిందితుడికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

టార్గెట్ విజయ్ - సుప్రీం లాయరా ? ఆధ్యాత్మిక గురువా ? మోడీ ఛాయిస్ ఏంటి ?
టార్గెట్ విజయ్ - సుప్రీం లాయరా ? ఆధ్యాత్మిక గురువా ? మోడీ ఛాయిస్ ఏంటి ?

జస్టిన్ మణికందన్ తరఫున హాజరైన డిఫెన్స్ న్యాయవాది ఆయన జూలై 6న ₹100 కోట్ల ఆస్తిని వాస్తవంగా రిజిస్టర్ చేయలేదని బాంబు పేల్చారు. దానికి బదులుగా బాలచందర్ అనే మరో సబ్-రిజిస్ట్రార్ జూలై 3న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని వాదించారు. తమిళనాడు ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరించిందని, ప్రతీకార చర్యగా బాలచందర్‌ను విచారణ నుండి ఉద్దేశపూర్వకంగా కాపాడుతూ జూలై 6న కేవలం ప్రత్యామ్నాయ డ్యూటీలో ఉన్న మణికందన్‌ను బలిపశువు చేసిందని వాదించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే ప్రభుత్వం ఖండించింది.

Palani Temple Land Scam Suspended Sub-Registrar Says He s a Scapegoat Gets HC Bail
విజయ్ కు ప్రధాని మోడీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!
విజయ్ కు ప్రధాని మోడీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!

సబ్-రిజిస్ట్రార్ బాలచందర్ జూలై 3న కేవలం ప్రాథమిక ఆన్‌లైన్ డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్‌ను మాత్రమే ప్రారంభించారని, కానీ రిజిస్ట్రేషన్‌ను ఆయన ఎప్పుడూ ఖరారు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. జూలై 6న డాక్యుమెంట్ ఖరారు చేసి, రిజిస్టర్ చేయడానికి కొడైకనాల్ నుండి 60 కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా మణికందన్ శాఖ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించారని ప్రభుత్వం వాదించింది. ఈ చట్టవిరుద్ధమైన లావాదేవీని వేగంగా పూర్తి చేశారనే కారణంతో ప్రభుత్వం మణికందన్ ను ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేర్కొంది.ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కేసు దర్యాప్తు తీరుపై అధ్యక్ష న్యాయమూర్తి పోలీసులను, రిజిస్ట్రేషన్ విభాగాన్ని నిలదీశారు. జూలై 3వ తేదీనే ఒక మాజీ అధికారి మోసపూరిత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తే ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లపైనా చర్య తీసుకోవాల్సి ఉండగా.. పోలీసులు ఎందుకు పక్షపాతం చూపుతున్నారని ప్రశ్నించింది. కేవలం ఒక అధికారిని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని న్యాయమూర్తి నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+