Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ పై తేల్చేసిన కేంద్రం- ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..!

నీట్ పేపర్ లీక్‌తో సహా ఇతర పరీక్షలలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 28 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన రెండు రోజులకు మించి బతకరనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోనమ్ ఆరోగ్యం కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది రాకేష్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్బంగా కేంద్రం కీలక హామీ ఇచ్చింది.

US-Iran War: హార్ముజ్ లో భారతీయుల నౌకపై దాడి..! ఇరాన్ పై కేంద్రం ఫైర్..
US-Iran War: హార్ముజ్ లో భారతీయుల నౌకపై దాడి..! ఇరాన్ పై కేంద్రం ఫైర్..

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, ఆయనకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఏ పౌరుడి ప్రాణమైనా విలువైనదేనని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని, అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని ఇప్పటికే ప్రభుత్వ డాక్టరు, నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వాంగ్‌చుక్ పరిస్థితిని బట్టి వైద్యులు సూచించే ఏ రకమైన సహాయం లేదా చికిత్సనైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ధర్మాసనానికి హామీ ఇచ్చారు.

Centre Says Intervention in Sonam Wangchuk s Fast Will Depend on Doctors Recommendation
విజయ్ కు ప్రధాని మోడీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!
విజయ్ కు ప్రధాని మోడీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!

సోనమ్ వాంగ్‌చుక్ భద్రతను కాపాడాలని, అవసరమైన వైద్య చికిత్స అందించాలని, అవసరమైతే ఆసుపత్రికి తరలించడం, బలవంతంగా ఆహారం తినిపించడం వంటివి చేయాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది రాకేష్ కుమార్ సైనీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వాంగ్‌చుక్ ప్రాణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని, ఆయన ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు ద్రవరూప ఆహారం ద్వారా అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అందించాలని పిటిషన్‌లో అధికారులను కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తగు ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+