బేసన్ లడ్డు.. ఇలా చేస్తే నోట్లో కరిగిపోతుంది!

లడ్డూలు ఎవరికి ఇష్టం ఉండదు.. తీపిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ లడ్డుని ఇష్టంగా తింటారు. మనం రకరకాల పదార్థాలతో లడ్డూలు చేసుకొని తింటూ ఉంటాం. ముఖ్యంగా పండుగలు, వివాహాది వేడుకలు సమయంలో వీటిని కామన్ గా తయారు చేసుకుని వేడుక చేసుకుంటారు. అయితే ప్రస్తుతం మనం భారతీయులు ఇష్టంగా తినే స్వీట్లలో ఒకటి అయిన బేసన్ లడ్డు గురించి తెలుసుకుందాం. పక్కా కొలతలతో తయారు చేసుకుంటే దీని రుచి అమోఘంగా ఉంటుంది.

బేసన్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు

శనగపిండి: రెండు కప్పులు
పంచదార పొడి: ఒక కప్పు
నెయ్యి: అరకప్పు
యాలకుల పొడి: అర టీ స్పూన్
బాదంపప్పు: 10
పిస్తా పప్పు: 10
జీడిపప్పు: 10

besan laddu know how to make delicious Besan Laddu at home with this easy step-by-step recipe

తయారీ విధానం

ముందుగా ఒక మందంగా ఉన్న పాన్ తీసుకుని స్టవ్ వెలిగించి దానిపైన పెట్టి శనగ పిండిని మీడియం ఫ్లేమ్ పైన 10 నుండి 12 నిమిషాల పాటు వేయించుకోవాలి. శనగపిండి వేగిన అరోమా ముక్కుకు తాకాలి. లేత బంగారు రంగులోకి రావాలి. ఆ తర్వాత వేయించిన బేసన్ లో నెయ్యి వేసి బాగా కలపాలి. నెయ్యి కలిపిన తర్వాత కూడా కొద్దిగా శనగపిండిని వేయించుకోవాలి.

ఇలా చేసుకుంటే బేసన్ లడ్డూలు సూపర్

ఆపై స్టవ్ ఆఫ్ చేసి అందులో పంచదార పొడిని, యాలకుల పొడిని కలపాలి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత నెయ్యితో తడుపుతూ చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఈ లడ్డుల పైన మధ్యలో పిస్తా, బాదం, జీడిపప్పు ముక్కలు అంటిస్తూ డెకరేట్ చేసుకోవాలి. అయితే ఈ బేసన్ లడ్డు బాగా రావాలంటే శనగపిండి బాగా వేగ కుండా చూసుకోవాలి.

బెల్లంతో కొబ్బరి లడ్డు.. రుచికే కాదు మంచి పోషకం కూడా!
బెల్లంతో కొబ్బరి లడ్డు.. రుచికే కాదు మంచి పోషకం కూడా!

ఈ చిట్కాలతో రుచికరమైన బేసన్ లడ్డు

బాగా ఎక్కువగా వేగితే అది రుచి పోతుంది. లడ్డూలు గట్టి పడకుండా ఉండాలంటే నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే వీటిని గాలి తగలని డబ్బాలో భద్రపరచుకోవాలి. పైన చెప్పిన కొలతలతో 15 నుండి 20 లడ్డూలు చేసుకోవచ్చు. మీకు అవసరాన్ని బట్టి పిండి క్వాంటిటీ ని తీసుకొని, అందుకు తగ్గ చక్కెరను తీసుకుని లడ్డూలు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+