ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: కెసిఆర్‌కు చంద్రబాబు కౌంటర్

రీకాకుళం: నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

దామాషా ప్రకారం నదీ జలాలను రాష్ట్రాలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎపికి నీరు రాకపోతే కృష్ణా డెల్టా ఇబ్బందుల్లో పడుతుందని ఆయన అన్నారు. దానికితోడు సముద్రం ఉప్పునీళ్లు పొలాల్లోకి వచ్చి పంటలు దెబ్బ తింటాయని చంద్రబాబు అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులపై కమిటీ సమావేశంలో కూర్చుని, రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధిద్దామని ఆయన కెసిఆర్‌కు సూచించారు.

అలా అంటే తనను విమర్సిస్తున్నారని, విమర్శించినా ఫరవాలేదని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీ పడేది లేదని ఆయన అన్నారు. తమకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. సమస్యను సామరస్యపూర్వకంగా కేంద్రం పరిష్కరించాలని ఆయన అన్నారు.

Chandrababu retaliates KCR on Irrigation projects

పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మాట్లాడకపోతే నష్టపోతామని ఆయన అన్నారు. తెలంగాణకు నీళ్లు రావాలని, అదే సమయంలో ఎపికి కూడా దామాషా ప్రకారం నీరు దక్కాలని ఆయన అన్నారు. తెలంగాణ మాత్రమే కాదు, ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి దామాషా ప్రకారం నీటిని వాడుకోవాలని ఆయన అన్నారు.

మనం అన్ని రాష్ట్రాలకు దిగువన ఉన్నామని చంద్రబాబు చెబుతూ కృష్ణా, గోదావరి, పెన్నా, నాగావళి తదితర నదుల జలాలు సముద్రంలోకి పోతున్నాయని, పైన ప్రాజెక్టులు కడితే మనకు ఇబ్బంది వస్తుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+