లంచ్ బాక్స్ స్పెషల్ "క్యారెట్ రైస్".. ఇలా చేస్తే 10 నిమిషాల్లోనే రెడీ..!
చాలామంది ఇప్పటివరకూ రైస్ ను చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. అయితే క్యారెట్ రైస్ ను ఎప్పుడైనా ట్రై చేశారా..? క్యారెట్ రైస్ చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టేందుకు కేవలం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అవుతుంది. క్యారెట్ రైస్ టేస్ట్ తో పాటు ఇందులో అనేక పోషకాలు కూడా దాగి ఉన్నాయి. మరి ఈ క్యారెట్ రైస్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
క్యారెట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన అన్నం ఒక కప్పు, క్యారెట్ తురుము ఒక కప్పు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్, ఉప్పు, పసుపు, గరం మసాలా రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. ఆ తర్వాత టేస్టీ క్యారెట్ రైస్ తయారీ విధానం చూస్తే.. ముందుగా పాన్ లో రెండు చెంచాల నూనె వేయాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త రంగు మారే వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ కలుపుకోవాలి.

ఇప్పడు ముఖ్యమైన పదార్థం.. ఒక కప్పు క్యారెట్ తురుము వేసి 3 నిమిషాలు నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తినని పిల్లలు కూడా ఇలా తరిమి చేస్తే అస్సలు కనిపెట్టకుండా తినేస్తారు. ఇప్పుడు క్యారెట్ మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరగా ఉడికించి చల్లార్చిన అన్నం వేసి మసాలా అంతా పట్టేలా బాగా టాస్ చేయాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే ఎంతో కలర్ ఫుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయినట్టే.. మీరూ ఇలా ట్రై చేసుకోండి..












Click it and Unblock the Notifications