తమ్ముళ్లకు చంద్రబాబు గుడ్ న్యూస్ - అయిదేళ్ల నిరీక్షణ..!!

ఏపీలో అధికారం దక్కేదెవరికి. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. గెలుపు పైన వైసీపీ, టీడీపీ కూమటి ధీమాగా ఉన్నాయి. కానీ, అసలు గెలిచేదెవరనేది టెన్షన్ పెంచుతోంది. ఇప్పటికే జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. విదేశాలకు వెళ్లిన చంద్రబాబు నేడు రాష్ట్రానికి రావటంతోనే పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఫలితాల పైన మాట్లాడనున్నారు.

విదేశాల నుంచి చంద్రబాబు
తెలుగుదేశ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విదేశాల నుంచి తిరిగి వస్తూనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు.అమెరికాకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు వెళ్లారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ChandraBabu Return form abroad crucial meeting with party leaders on Election Counting

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో... ఈరోజు ఆయన తిరిగి వస్తుండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటుండటంతో టీడీపీ నేతలు ఆయనను కలిసేందుకు ఉత్సాహపడుతున్నారు. బుధవారం చంద్రబాబు అమరావతిలో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు.

పార్టీ నేతలతో సమావేశం
ఎన్నికల పోలింగ్ తరువాత వారణాసి వెళ్లిన చంద్రబాబు అక్కడ ఒక మీడియా సంస్థతో ఏపీలో గెలుస్తున్నామని చెప్పారు. ఆ తరువాత ఎక్కడా ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించ లేదు. ప్రతీ సారి ఎన్నికల తరువాత టీడీపీ అధినాయకత్వం ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాల పైన మాట్లాడటం జరిగేది.

కానీ, ఈ సారి అందుకు భిన్నంగా చంద్రబాబు ఎక్కడా ఎన్నికల ఫలితాలు..తమ గెలుపు అవకాశాల పైన మాట్లాడకపోవటం పార్టీలో మరింత టెన్షన్ కు కారణంగా మారింది. అటు జగన్ ఐ ప్యాక్ సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసారు. జగన్ చెప్పిన లెక్కల పైన టీడీపీ నేతలు స్పందించకపోవటం మరింత ఉత్కంఠగా మారింది.

ఫలితాల పై అంచనాలు
అయితే, టీడీపీ ముఖ్య నేతలు మాత్రం గెలుపు పైన ధీమాగా ఉన్నారు. చంద్రబాబుతో టచ్ లో ఉన్న కీలక నేతలు గెలుపు ఖాయమని విశ్వాసంతో కనిపిస్తున్నారు. చంద్రబాబు అదే నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు. విదేశీ పర్యటనలో సైతం చంద్రబాబు పోలింగ్ సరళి పైన సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల పైన కసరత్తు చేసినట్లు సమాచారం.

అదే విధంగా అధికారంలోకి రావటం పైన చంద్రబాబు ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు. విదేశీ పర్యటన పూర్తయిన తరువాత అమరావతిలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశంలో కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. అదే విధంగా టీడీపీ కూటమి గెలుపు..భవిష్యత్ ప్రణాళికలను చంద్రబాబు వివరించనున్నారు. దీంతో...చంద్రబాబు చెప్పే అంశాల పైన ఆసక్తి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+