చంద్రబాబు సొంతూరి సంక్రాంతి వెనుక కథ తెలుసా ? సీఎం మనసులో మాట..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతీ ఏటా సంక్రాంతికి స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లి సంబరాలు చేసుకుంటారు. గత పాతికేళ్లుగా ఆయన ఇలాగే నారావారిపల్లె వెళ్లి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఆయన తన స్వగ్రామం వెళ్లి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే దీని వెనుక ఓ ఆసక్తికర కారణం ఉందట. ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో చంద్రబాబు దీని వెనుక కథ చెప్పారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తాను అందుకే తన సొంతూరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నట్లు వెల్లడించారు. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణగా ఉంటుందన్నారు.

ఇంతకీ తాను ప్రతీ ఏటా సంక్రాంతికి సొంతూరికి ఎందుకు వెళ్తానో చంద్రబాబు కారణం చెప్పారు. తాను ఇలా సంక్రాంతికి సొంతూరు వెళ్లే సంప్రదాయానికి భార్య భువనేశ్వరే కారణమని వెల్లడించారు. పాతికేళ్ల క్రితం భువనేశ్వరి పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరమన్నారు. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు.. ఆ ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications