అందుకే యూటర్న్ తీసుకున్నా-రీజన్ చెప్పేసిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. గతంలో తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో వెల్లడించారు. అంతే కాదు అలా తాను యూటర్న్ తీసుకోవాల్సి రావడం వెనుక కారణాన్ని కూడా చంద్రబాబు బయటపెట్టారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఓపెన్ గా మాట్లాడుతున్న చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా పిల్లల్ని కనాలంటూ తాను ఈ మధ్య చెప్పిన విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో చంద్రబాబు గతంలో తాను తీసుకున్న పాలసీకి భిన్నంగా ఇలా నిర్ణయం మార్చుకోవడం వెనుక కారణాన్ని బయటపెట్టారు. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

గతంలో ఎక్కువ మంది పిల్లలు వద్దని తానే చెప్పినట్లు సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చిందంటూ వెల్లడించారు. కానీ ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో ఎక్కువ పిల్లాల్ని కనాలని చెబుతున్నట్లు గుర్తుచేశారు. అంతే కాదు ప్రస్తుతం ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయని, కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లల వరకైనా ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తామన్నారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కూడా కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications