అంతరిక్షం నుంచి రాత్రిపూట సూర్యరశ్మి..! చంద్రబాబు కామెంట్స్ పై ట్రోలింగ్ -సర్కార్ క్లారిటీ..!

వైజాగ్ లో జరుగుతున్న సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు (Chandrababu) చేసిన అంతరిక్షం నుంచి రాత్రిపూట సూర్యరశ్మి కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అంతరిక్షం నుంచి రాత్రిపూట సూర్యరశ్మి ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ పలువురు సీఎం చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. అలాంటి ఒక టెక్నాలజీ ఉందంటూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!
వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!

అంతరిక్షం నుంచి పగలు తరహాలోనే రాత్రిపూట కూడా సూర్యరశ్మిని రప్పించే టెక్నాలజీ ఉందని, ప్రస్తుతం అంతర్జాతీయ స్ధాయిలో దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్' (Reflect Orbital) అనే అంతరిక్ష స్టార్టప్ సంస్థ, భూకక్ష్యలో భారీ అద్దాలతో (Reflectors) కూడిన ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, రాత్రి సమయంలో భూమిపై ఎంపిక చేసిన ప్రాంతాలకు సూర్యకాంతిని ప్రతిబింబించే ప్రాజెక్టును చేపడుతోందని తెలిపింది. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్' సంస్థ, భారత్‌కు చెందిన 'స్కైరూట్ ఏరోస్పేస్'తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని, స్కైరూట్ రూపొందించిన 'విక్రమ్' రాకెట్ల సహాయంతో ఈ ప్రయోగాలు జరగనున్నాయని పేర్కొంది.

Chandrababu s Sunlight-from-Space Remark Triggers Online Trolls AP Govt Issues Clarification

ఈ టెక్నాలజీ వల్ల నిరంతరాయ సౌర విద్యుత్ ఉత్పత్తి: సాధారణంగా సోలార్ పవర్ ప్లాంట్లు పగటిపూట మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. అంతరిక్షం నుండి రాత్రిపూట కూడా సూర్యరశ్మిని సోలార్ ఫామ్‌లపైకి మళ్లించడం ద్వారా, సూర్యాస్తమయం తర్వాత, తెల్లవారుజామున పీక్ డిమాండ్ సమయంలోనూ సౌర విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించవచ్చని పేర్కొంది. విద్యుత్ నిల్వ (బ్యాటరీ) ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపింది. దీంతో రాత్రివేళల్లో విద్యుత్ అవసరాల కోసం భారీ స్థాయిలో ఖరీదైన బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని వెల్లడించింది.

Chandrababu s Sunlight-from-Space Remark Triggers Online Trolls AP Govt Issues Clarification
Explainer: జగన్ కోసమే చట్టం చేస్తున్న చంద్రబాబు..! దేశంలో ఇదే తొలిసారి..!
Explainer: జగన్ కోసమే చట్టం చేస్తున్న చంద్రబాబు..! దేశంలో ఇదే తొలిసారి..!

అలాగే తుఫాన్లు, భూకంపాలు లేదా వరదలు సంభవించి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన ప్రాంతాల్లో, రాత్రిపూట సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన వెలుతురును ఈ ఉపగ్రహాల ద్వారా అందించవచ్చని తెలిపింది. చలి ప్రదేశాల్లో లేదా పగటి సమయం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పంటల ఎదుగుదలకు అవసరమైన వెలుతురును అందించడానికి, అలాగే నిరంతరాయంగా పనిచేసే భారీ నిర్మాణ ప్రాజెక్టులకు ఇది ఉపయోగపడుతుందని కూడా తెలిపింది. ఫైనల్ గా అంతరిక్షం నుండి రాత్రిపూట సూర్యరశ్మిని అందించే సాంకేతికత అనేది కల్పితం కాదని, 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్', భారతీయ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' భాగస్వామ్యంతో ఈ ప్రయోగం వాస్తవ రూపం దాల్చుతోందని వెల్లడించింది. భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఈ నూతన ఆవిష్కరణ గురించి చంద్రబాబు చెప్తే.. కొందరు దీనిపై అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టత ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+