చంద్రబాబు సర్‌ప్రైజ్ చేశారు
చిత్తూరు: తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రికి తమ సమస్యలను చెప్పడానికి స్థానికులు ఎగబడ్డారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించడంతో పాటు వివిధ అభివృద్ధి పనుల్లో చొరవచూపిస్తున్న ముఖ్యమంత్రికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. మురికి వాడలను తొలగించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. స్థలాలు ఉన్న వారికి బహుళ అంతస్తుల భవనాల్లోనే శాశ్వత ఇళ్లు నిర్మిస్తామని, స్థలాలు లేని వారికి బయటి ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications