రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి మన పొట్టగొట్టారు: చంద్రబాబు

ఏలూరు: రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడానికి మన పొట్ట గొట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర విభజనను ప్రస్తావిస్తూ ఆయన ఆ మాట అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఆయన శనివారం జాతికి అంకితం చేసి మాట్లాడారు. ఇన్నేళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాలేదని, రాష్ట్ర విభజనతో మన సమస్యలు మరింతగా పెరిగాయని ఆయన అన్నారు.

ఇక్కడి వాళ్లు విదేశాలకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారని, నీళ్లు ఇస్తే రైతులు బంగారం పండిస్తారని, అందుకే తాను సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నానని ఆనయ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి జిల్లాల నీటి సమస్య తీరుతుందని ఆయన చెప్పారు. 2018 కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఏడాదికి సగటున 3 వేల టిఎంసిల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, గోదావరీ కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ఆ నీటిని వాడుకోవచ్చునని ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ధవళేశ్వరం ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసి, వాటిని కృష్ణా డెల్టాకు అందిస్తామని, కృష్ణా జలాలను శ్రీశైలంలో నిల్వ చేసి రాయలసీమకు అందిస్తామని ఆయన చెప్పారు.

 Chandrababu says Congress ditched AP to make Rahul Gandhi as PM

పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రెచ్చగొట్టారని, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, అన్ని సీట్లను టిడిపికే కట్టబెట్టారని, అటువంటి జిల్లాకు అన్యాయం చేయాలని తాను కలలో కూడా అనుకోనని, అన్యాయం చేసే ఆలోచనే లేదని ఆయన అన్నారు. తన శరీరంలో చివరి రక్తంబొట్టు ఉన్నంత వరకు గోదావరి జిల్లాలకు అన్యాయం తలపెట్టబోనని ఆయన స్పష్టం చేశారు.

తన మాటలను పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు విశ్వసించారని, వారికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. నదుల అనుసంధానం కలగా మిగిలిపోతుందని అనుకున్న స్థితిలో అది సాకారమవుతోందని ఆయన అన్నారు. అభివృద్ధి అవసరం లేదనుకునేవారు అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. రాజధానిని మారుమూల ప్రాంతంలో పెట్టాలని అన్నారని, తాను గట్టిగా సమాధానం చెప్తే మాట్లాడలేకపోయారని ఆయన అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు నీళ్లు ఇస్తేనే ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. వంశధారను పూర్తి చేస్తే శ్రీకాకుళం జిల్లాకు నీరు అందిస్తామని ఆయన చెప్పారు. అవసరమైతే అప్పైన చేసి, ఎక్కువ కూడా డబ్బులు పెట్టి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+