కసి తెలుసు, ఢిల్లీతో పోరాడుతా: బాబు కీలకవ్యాఖ్య, 'కేంద్ర స్కీంల ద్వారా 1.7 శాతం నిధులు ఎక్కువ డ్రా'

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలన్నారు.

చదవండి: బీజేపీపై టీడీపీ 'ప్రత్యేక' అస్త్రం: షాకివ్వబోయి పవన్ వ్యూహంలో జగన్ గిలగిల

విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు కావాల్సిందే అన్నారు. తనకు అండగా నాలుగు లక్షల మంది సాధికార మిత్ర సైనికులు ఉన్నారని చెప్పారు. 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా కేంద్రం న్యాయం చేయాలని ఒకే మాట చెబుతున్నారన్నారు.

చదవండి: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?

ఆంధ్రుల కసి నాకు తెలుసు

ఆంధ్రుల కసి నాకు తెలుసు

ఏపీకి ప్రత్యేక హోదా - ప్యాకేజీ, విభజన హామీల అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల కసి తనకు తెలుసునని చెప్పారు. కేంద్రం సాయం చేసే దాకా వదిలి పెట్టేది లేదన్నారు. చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చాలన్నారు.

ఇవ్వకుంటే వదిలి పెట్టను

ఇవ్వకుంటే వదిలి పెట్టను

కేంద్రం నిధులు ఇవ్వకుంటే తాను వదిలి పెట్టనని, పోరాడుతానని చంద్రబాబు చెప్పారు. విభజన సమయంలో చారిత్రక తప్పిదం చేసిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని, అలాంచి చరిత్ర మన ప్రజలకు ఉందన్నారు.

కేంద్రంపై పోరాడుతా

కేంద్రంపై పోరాడుతా

కేంద్రం ఏపీకి న్యాయం చేయాలని చంద్రబాబు అన్నారు. అప్పటి వరకు తాను పోరాడుతానని తేల్చి చెప్పారు. కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, దానిని తాను పట్టించుకోనని చెప్పారు. నిధులు తెచ్చే వరకు పోరాడుతానని చెప్పారు.

1.7 శాతం నిధులు అధికంగా డ్రా

1.7 శాతం నిధులు అధికంగా డ్రా

ఇదిలా ఉండగా, కేబినెట్ భేటీలో కేంద్రం నుంచి దామాషా పద్దతిలో వచ్చిన నిధులపై సమీక్షించారు. వివిధ కేంద్ర పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం 1.7 శాతం నిధులను అధికంగా డ్రా చేసుకుందని కేబినెట్‌కు అధికారులు తెలిపారు. ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు అధికంగా ఉపయోగించుకున్నామని చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+