• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీపై టీడీపీ 'ప్రత్యేక' అస్త్రం: షాకివ్వబోయి పవన్ వ్యూహంలో జగన్ గిలగిల

|
  No Confidence Motion : Better To Take Chance By Which Party ?

  అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఇప్పుడు నిధులు కూడా ఇవ్వమని చెబితే ఎలాగని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. కొన్ని రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదాను పొడిగించిందని గుర్తు చేస్తూ హోదానా లేక నిధులా అంటూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఆ విషయంలో హెచ్చరికలు, పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దు

  మంగళవారం టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. నాడు ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే తాము అంగీకరించామని చెప్పారు. ఇప్పుడు హోదా ఇవ్వకపోగా నిధులు కూడా ఇవ్వమని చెబితే ఎలాగని ప్రశ్నించారు.

  బాబు పార్ట్‌నర్: పవన్‌ను దెబ్బతీసేందుకు పెద్ద కుట్ర? అలా చేస్తే జనసేనానిది తప్పటడుగే!

  హోదా ఇవ్వక, ప్యాకేజీ ఇవ్వకుండా

  హోదా ఇవ్వక, ప్యాకేజీ ఇవ్వకుండా

  కేంద్రం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించిందని పయ్యావుల అన్నారు. అలాంటప్పుడు విభజన చట్టం ద్వారా ఏపీకి వచ్చిన హక్కును తాము ఎందుకు వదులుకోవాలని బీజేపీని ప్రశ్నించారు. హోదా కాకుండా కనీసం ప్యాకేజీతో ఏపీని గట్టెక్కిద్దామనుకుంటే బీజేపీ ఆ దిశగా సహకరించడం లేదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వైసీపీకి కూడా పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. అవిశ్వాసం పెడితే ఏం లాభమని అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు చర్చతో ముగుస్తుందని, కేంద్రంపై ఒత్తిడికి అవిశ్వాసం సరిపోదన్నారు. అవిశ్వాసం ఆఖరి అస్త్రమన్నారు.

  ఎవరిది పైచేయి?

  ఎవరిది పైచేయి?

  ఓ వైపు అవిశ్వాసం విషయంలో టీడీపీ వెనుకంజ వేస్తుండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై పవన్ సోమవారం సాయంత్రం చేసిన ప్రకటనపై వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి నేతలు విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ పైచేయి కోసం ప్రయత్నిస్తోంది.

  పవన్ కళ్యాణ్‌కు వైసీపీ మెలిక

  పవన్ కళ్యాణ్‌కు వైసీపీ మెలిక

  వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే తాను పార్టీల మద్దతును కూడగడతానని పవన్ కళ్యాణ్ ప్రతి సవాల్ చేశారు. అయితే, ఇక్కడ వైసీపీ మెలిక పెట్టింది. పవన్‌ను ఇరకాటంలో పడేసేలా మెలిక పెట్టామని భావిస్తున్నప్పటికీ, ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా వైసీపీ మెలిక ఉందని అంటున్నారు. అవిశ్వాసం విషయంలో టీడీపీ రావాల్సిన అవసరం ఏముందని, ఆ పార్టీ రాకుంటే ఏపీ ప్రజలు దానినే తిప్పికొడతారని చెబుతున్నారు.

  చంద్రబాబు రాకుంటే వారికే నష్టం

  చంద్రబాబు రాకుంటే వారికే నష్టం

  అవిశ్వాసం పెడితే తాను తమిళనాడు, ఢిల్లీ వెళ్లి మద్దతు కూడగడతానని పవన్ చెప్పారు. అయితే ముందు టీడీపీని ఒప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఏపీ ప్రయోజనాల కోసం వైసీపీ అవిశ్వాసం పెడితే, టీడీపీ కలిసి రాకుంటే అప్పుడు చంద్రబాబే నష్టపోతారని, క్రెడిట్ జగన్‌కే ఎక్కువ వస్తుందని, కానీ కేసుల భయంతో అవిశ్వాసం పెట్టలేక ముందు టీడీపీని ఒప్పించమని మెలిక పెడుతున్నారని అంటున్నారు. అవిశ్వాసానికి కాంగ్రెస్ కూడా సిద్ధమంటున్నప్పుడు జగన్ ఎందుకు వెనక్కి పోతున్నారని అంటున్నారు. టీడీపీ, వైసీపీలు అవిశ్వాసం పెట్టవచ్చు కదా అని నాలుగు రోజుల క్రితం పవన్ అన్న వ్యూహంలో జగన్ ఇప్పుడు చిక్కుకున్నారంటున్నారు. టీడీపీ మాత్రం అవిశ్వాసానికి నో చెప్పింది. జగన్ సై అని ఇప్పుడు మెలిక పెడుతున్నారంటున్నారు.

  వైసీపీ, టీడీపీ మధ్య రాజీనామా, అవిశ్వాసం వార్

  వైసీపీ, టీడీపీ మధ్య రాజీనామా, అవిశ్వాసం వార్

  అవిశ్వాసం, రాజీనామాల విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. అవిశ్వాసంతో లాభం లేదని, ఒక్క రోజు చర్చతో అది పూర్తవుతుందని, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అంచెలంచెలుగా ముందుకు వెళ్లాలని టిడిపి చెబుతోంది. రాజీనామాలే చేయాలని వైసీపీ అంటోంది. కానీ పవన్ చెప్పిన అవిశ్వాసానికి మాత్రం టీడీపీ, వైసీపీలు ముందుకు రావడం లేదు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan on Monday threw a counter-challenge at YSRCP leader YS Jagan Mohan Reddy to immediately move a no-confidence motion against the government at the centre and that he would support him to get the numbers in order to get special status for Andhra Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more