బాబు పార్ట్‌నర్: పవన్‌ను దెబ్బతీసేందుకు పెద్ద కుట్ర? అలా చేస్తే జనసేనానిది తప్పటడుగే!
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఉద్దేశ్యపూర్వకంగా దాడి జరుగుతోందా? 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కావాలనే చంద్రబాబు దోస్తీగా ప్రజల మెదళ్లలో చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
2014లో పొత్తును ఆసరాగా తీసుకొని చంద్రబాబుకు అవసరమైనప్పుడే బయటకు వస్తున్నారని, టీడీపీకి మద్దతుదారు అని కావాలని ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను ఎవరి పక్షం కాదని, ప్రజాపక్షం అని పదేపదే చెబుతున్నారు. వైసీపీ 2019 టార్గెట్‌గా రాజకీయంగా కార్నర్ చేయాలనే ఉద్దేశ్యంతో విమర్శలు చేస్తున్నప్పటికీ ఇతర చోట్ల విమర్శలు మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే అంటున్నారు.
చదవండి: అవిశ్వాసంతో దిగొచ్చిన కేంద్రం! రేపు కేబినెట్ భేటీ, ఏం లాభం.. పవన్‌కు బాబు దిమ్మతిరిగే షాక్

పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం
పవన్ కళ్యాణ్ ఎవరి పక్షం కాదని, అసలు సిసలైన రాజకీయం చేస్తున్నారని, ప్రజాపక్షాన ఉంటున్నారని పదేపదే ఉదాహరణలు కనిపిస్తున్నప్పటికీ 2019 ఎన్నికలకు ముందు పవన్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు కావాలని చంద్రబాబు స్నేహితుడిగా ప్రచారం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుతో అలా అయితే కలయిక
పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలిసే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ విషయంలో పవన్ ప్రత్యేక హోదా లేదా దానికి సమానమైన ప్యాకేజీ కోసం కొట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీ పక్కన పెట్టి చంద్రబాబు వస్తే 2019లో కలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు బీజేపీతోనే ఉంటే మాత్రం ఇరువురిని కడిగిపారేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఎలాగు మనవైపు కాదు!
హోదా ఇవ్వకుంటే బీజేపీని కాదని వస్తే లెఫ్ట్, టీడీపీ, జనసేన మైత్రికి అవకాశాలున్నాయి. చంద్రబాబు బీజేపీతోనే ఉండాలనుకుంటే లెఫ్ట్, జనసేన కలిసి ముందుకు సాగవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పవన్ వైసీపీతో చేతులు కలపరు. ఎలాగు మన వైపు వచ్చే అవకాశం లేదు కాబట్టి దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో పవన్ పై బాబు మిత్రుడిగా ముద్రవేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

బాబునే కాదు విపక్షంగా ఫెయిలైందని వైసీపీనీ అనలేదు
2014లో టీడీపీ - బీజేపీకి మద్దతివ్వడం మొదలు చంద్రబాబును ఘాటుగా విమర్శించకపోవడంపై పవన్ పలుమార్లు వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఏపీలో వైసీపీ కూడా ప్రతిపక్షంగా ఫెయిలైందని గట్టిగా ఎప్పుడు పవన్ చెప్పలేదు. అలా అని వైసీపీ అనుకూలం అని అంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ స్థానంలో కాంగ్రెస్ లేదా ఇతరులు ప్రతిపక్షంలో ఉంటే ఇప్పటికే చంద్రబాబుకు మూడు చెరువుల నీళ్లు తాగించేవారని, కానీ జగన్ అలా చేయలేకపోతున్నారనే వారు లేకపోలేదు. కానీ అటు టీడీపీని, ఇటు వైసీపీని పవన్ అనలేదని గుర్తు చేస్తున్నారు.

పవన్ అసలైన రాజకీయం
పవన్ ప్రజల కోసం రాజకీయం చేస్తున్నారని జనసేన చెబుతోంది. 2014లో టీడీపీ - బీజేపీకి మద్దతివ్వడానికి ప్రత్యేక హోదా, నవ్యాంధ్రకు అనుభవజ్ఢుడైన సీఎం కావాలని పవన్ చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఇక, అమరావతి రైతుల నుంచి మొదలు శ్రీకాకుళం ఉద్ధానం వరకు పవన్ ప్రభుత్వంపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించకుండా సమస్యలు పరిష్కారమయ్యే సూచలను చేశారని, అసలైన రాజకీయం అదేనని గుర్తు చేస్తున్నారు.

బాబు, జగన్‌లు అలా, పవన్ కళ్యాణ్ ఇలా
అటు చంద్రబాబుకు, ఇటు జగన్‌కు అధికారమే పరమావధి కాబట్టి వారు ఎలాంటి రాజకీయాలైన చేయగలరని, కానీ పవన్ కోరుకునేది ప్రజలకు మంచి జరిగే రాజకీయం అని, ఆయన పదవుల కోసం వెంపర్లాడం లేదని అందుకే ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం కంటే సమస్య పరిష్కారమయ్యే సూచనలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

అలా చేస్తే పవన్ కళ్యాణ్‌ది అతిపెద్ద తప్పటడుగు!
రాజకీయాల్లో అంశాల వారీగా ప్రభుత్వలకు మద్దతు ఇచ్చే పార్టీలు ఉంటాయి. పవన్ కూడా సమస్య వారిగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారని, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్న పవన్.. విశాఖ డీసీఐ విషయంలోను కేంద్రానికి సున్నితమైన అల్టిమేటం జారీ చేశారని గుర్తు చేస్తున్నారు. హోదా ఇస్తే పవన్ తిరిగి బీజేపీ, టీడీపీతో జత కడితే తప్పు బట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నాడు మద్దతిచ్చింది, నేడు వారిని నిలదీస్తోంది అందుకోసమే.హోదా ఇవ్వకుండా బీజేపీతో కలిసినా, బీజేపీతో జత కలిసే టీడీపీతో ఉన్నా అప్పుడు ఆయన పెద్ద తప్పు చేసినట్లు అవుతుందని అంటున్నారు. హోదా ఇవ్వని పరిస్థితుల్లో బీజేపీకి దూరమైతే టీడీపీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి జనసేన కలిస్తే సమస్య లేదని, అయినా పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ముందుముందు తేలుతుందని అంటున్నారు. కానీ ఎలాగు తమవైపు రాడని వైసీపీ తదితరులు ముందే అతనిని బాబు పార్ట్‌నర్‌గా చెప్పి వ్యతిరేకత పెంచే కుట్ర చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications