Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ఉస్తాద్'కు నో కట్స్.. ఓన్లీ పవర్! సెన్సార్ పూర్తి, రన్‌టైమ్ లాక్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అసలైన 'పవర్‌' తుపాను ముంచుకొస్తోంది. పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ వేసవికి హీట్ పెంచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఉగాది పండుగ కానుకగా మార్చి 19న థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు ఎక్కడా ఒక్క కట్ కూడా చెప్పకుండా సినిమాకు 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమా అవుట్‌పుట్ అదిరిపోయిందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ప్రేక్షకుల ఉత్కంఠకు తెరదించుతూ మూవీ రన్‌టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. పక్కా కమర్షియల్ ప్యాకేజీతో, ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని ఎలివేషన్లతో ఉస్తాద్ రాబోతున్నాడని విడుదల చేసిన పవన్ కల్యాణ్ - శ్రీలీల పోస్టర్ స్పష్టం చేస్తోంది.

Ustaad Bhagat Singh Release on March 19 Pawan Kalyan and Harish Shankar Ready to Dominate Summer Box Office

పోటీ ఉన్నా.. 'ఉస్తాద్' రూటే వేరు!

వాస్తవానికి ఈ సినిమా మార్చి 26న రావాల్సి ఉన్నా, 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందే అంటే మార్చి 19కే థియేటర్లలోకి వస్తోంది. అయితే, అదే సమయంలో 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రంతో పోటీ పడాల్సి ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'ధురంధర్ 2' ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్ల టికెట్ల బుకింగ్స్‌తో హోరెత్తిస్తుండగా, 'ఉస్తాద్' తన ప్రమోషన్లతో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ట్రైలర్ టీజ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేయగా, త్వరలో రాబోయే మెయిన్ ట్రైలర్ బాక్సాఫీస్ లెక్కలను మారుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ముందున్న అసలు సవాళ్లు..

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు? అనే ఉత్కంఠ నెలకొంది. వీటన్నింటికంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల అనుమతిపై చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు లభించే అవకాశం ఉన్నా, తెలంగాణలో ఉన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. ఏదేమైనా, థియేటర్లలో పవర్‌ స్టార్ మేనరిజమ్స్, హరీష్ శంకర్ డైలాగులు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+