45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన మూవీ "ధురంధర్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం ఏకంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్ 2' అంతకు మించిన రికార్డులను తిరగరాస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగాది, గుడి పడ్వా కానుకగా మార్చి 19న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే ట్రైలర్ ను విడుదల చేశారు. మార్చి 7న విడుదలైన ఈ ట్రైలర్, కేవలం 48 గంటల్లోనే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ సాధించి భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును నెలకొల్పింది. 45 దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలవడం హాట్ టాపిక్ గా మారింది.

ట్రైలర్‌లోని పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతూ.. నెటిజన్లు కూడా గట్టిగా రీల్స్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. మొదటి భాగం సాధించిన భారీ విజయం తర్వాత, ఈ సీక్వెల్ అంతకు మించిన యాక్షన్, ఎమోషన్స్‌తో ఉండబోతోందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
అయితే అదే రోజు తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రిలీజ్ కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 19న విడుదల చేయనుంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి దురంధర్ రికార్డులు తిరగరాస్తున్న తరుణంలో పవన్ మూవీ ఎన్‌ఐహెచ్ అవుతుందా ?లేదా ?? అని జోరుగా చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications