‘చంద్రబాబు వెంటనే రాజీనామా చేసి.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలి’
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.
హైద్రాబాద్: ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు నిర్దోషిగా తేలే వరకూ కుమారుడికి పదవి అప్పగించాలని నారాయణ సూచించారు.
సోమవారం సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీఐ నేత నారాయణ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపైనా నారాయణ విమర్శలు గుప్పించారు. వెంకయ్యకు కమ్యూనిస్టు భూతం పట్టుకున్నట్టుందని, ప్రత్యేక హోదాపై మాట ఇచ్చి తప్పింది వెంకయ్యేనని ఆయన విమర్శించారు. తాము ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నా లేకున్నా ఆదర్శంగా ఉన్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications