జగన్ - షర్మిల వివాదంపై స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ తీవ్ర విమర్శలు చేశరాు. ముఖ్యంగా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారంటూ జగన్ రచ్చ రచ్చ చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తాము అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు వేసే వారా అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత చంద్రబాబు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై నిశిత విమర్శలు చేశారు.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులకు ఊరట-ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులకు ఊరట-ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!

రక్త బంధానికి కూడా విలువ ఇవ్వని వ్యక్తి ఇక ప్రజలకు ఏం విలువ ఇస్తారు అంటూ జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జగన్ కు తండ్రి ఇచ్చిన ఆస్తిని చెల్లెలికి ఎందుకివ్వవు అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. చివరికి ఆస్తి కోసం తల్లిని కోర్టుకు ఈడ్చావు, నీ గురించి ఎవరికి తెలియదు అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా, పార్టీ నాయకుడిగా, కొడుకుగా, అన్నగా, కనీసం ఓ పౌరుడిగా ఇలా అన్నిట్లోనూ అతను విఫలం అయ్యాడంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

Chandrababu slams ys jagan for troubling own sister ys Sharmila over her daughter marriage
ఏపీలో తేలిన నామినేషన్ల లెక్క..! జగన్ మాటల్లో నిజమెంత ?
ఏపీలో తేలిన నామినేషన్ల లెక్క..! జగన్ మాటల్లో నిజమెంత ?

ఓ పౌరుడిగా అన్నింటికంటే దేశం ముఖ్యమని, దాని గురించి కూడా ఆలోచన చేసే శక్తి అతనికి లేదంటూ జగన్ పై చంద్రబాబు విమర్శలు చేశారు. ప్రజల సమస్యల గురించి చర్చించడానికి అసెంబ్లీకి రమ్మంటే అక్కడికీ రావటం లేదన్నారు. అలాంటి వ్యక్తులను ఎంచుకోవటం వల్ల సమాజానికి భద్రత వస్తుందా అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎవరికి నేర చరిత్ర ఉందో ప్రజలు అర్ధం చేసుకుని వ్యవహరించాలని కోరుతున్నట్లు తెలిపారు. కూటమిగా ప్రజాహితం కోసం రాజ్యాంగబద్ధంగా పని చేస్తుందని గుర్తుచేశారు. ఇక్కడ అందరి చరిత్ర తెరిచిన పుస్తకమేనని, ఎవరు మంచి చేశారో వారికి మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఓటర్లను చంద్రబాబు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+