టీచర్లు ఏమీ అడగొద్దా ? టీచర్స్ డే ట్వీట్ లో జగన్ సర్కార్ కు చంద్రబాబు ప్రశ్న

ఏపీలో గురుపూజోత్సవాన్ని ప్రభుత్వం ఇవాళ నిర్వహిస్తోంది. అయితే దీన్ని పలు ఉపాధ్యాయసంఘాలు బహిష్కరించాయి. వైసీపీ ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లకు గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన విపక్ష నేత చంద్రబాబు.. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు.

పిల్లలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే మహత్కార్యాన్ని నిర్వర్తిస్తోన్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "గురువును దైవంగా భావించే సమాజం మనది. తలెత్తుకు జీవించే గౌరవ స్థానంలో ఉండే ఉపాధ్యాయులు ఏపీలో ఈరోజు ప్రభుత్వ కక్ష సాధింపుకు గురవుతుండటం దురదృష్టకరం. గురుపూజోత్సవం వేళా గురువులకు జీతాల చెల్లింపు చెయ్యక పోవడమే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవమా? అంటూ ప్రశ్నించారు.

chandrababu slams ys jagan regime on anti-teacher policies in teachers day tweet

" సీపీఎస్ రద్దు కోసం అడగకూడదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అప్పుకోసం తాకట్టు పెట్టినా నోరెత్తకూడదు. పాఠశాలల విలీనం పేరిట విద్యను బాలబాలికలకు దూరం చేస్తుంటే మాట్లాడకూడదు" అంటూ మరో ట్వీట్ లో చంద్రబాబు విమర్శించారు.

ఇంకో ట్వీట్ లో "ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో ఒత్తిడి తెచ్చి విద్యా ప్రమాణాలను నాశనం చేస్తున్నా వారు కిక్కురుమనకూడదు అంటోంది ప్రభుత్వం. విద్యా శాఖలో సంస్కరణల పేరుతో తెచ్చిన సంక్షోభానికి ప్రభుత్వం తెరదించాలి. విద్యా వ్యవస్థ పై బాధ్యత గా, విద్యను అందించే గురువులపై గౌరవంగా వ్యవహరించాలి." అంటూ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+