పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా మారినా..: చంద్రబాబు పక్కా వ్యూహం!, లెక్కలు

విజయవాడ: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో రంగంలోకి దిగారు. ప్రత్యేక హోదా ఉద్యమంతో ఆయన తన ప్రస్థానాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి, వైసిపిలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

పవన్ వస్తే ఎవరికి ఎంత నష్టమో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. 2014లో తమకు మద్దతిచ్చిన పవన్ రంగంలోకి దిగడంతో.. 2019 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారని అంటున్నారు.

జగన్‌ది మాత్రమే, ఆ అలవాటు లేదు: సస్పెన్షన్‌పై పవన్ కళ్యాణ్‌కు రోజాసీఎం చంద్రబాబు... పవన్‌ రంగంలోకి దిగడంతో తన వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు. కరువు కారణంగా రాయలసీమలో ఎండిపోతున్న పంటలను కాపాడటంపై దృష్టి సారించారు. మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలోనే మకాం చేసి రైతులతో మమేకమయ్యారు.

 Chandrababu strategy on Pawan Kalyan

చంద్రబాబు టెక్నాలజీ మోజులో పడిపోయారన్న విమర్శలకు కూడా ఆయన తన చర్యల ద్వారా సమాధానం చెబుతున్నారు. పుష్కరాలలో లోటు పాట్లు తలెత్తకుండా టెక్నాలజీ ఉపయోగపడిందని, రాయలసీమ జిల్లాల్లో ఎండిపోతున్న పంటలను కాపాడటానికి రెయిన్ గన్‌ల టెక్నాలజీ ఉపయోగపడిందంటున్నారు.

ఇదంతా భవిష్యత్తు పరిణామాలను ఊహించి చేస్తున్నదే కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్‌‌ను దూరం చేసుకోకూడదని, అనివార్య పరిస్థితులలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన ప్రత్యర్థిగా మారినా పని చేసే సీఎంగా ప్రజలు తనను మాత్రమే ఆదరించేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+