చంద్రబాబు రోల్ మోడల్ కెసిఆర్: ప్రజల మనసు గెలిచేందుకు...

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును రోల్ మోడల్‌గా తీసుకుని ప్రజల హృదయాలను గెలుచుకునే దిశగా అడుగు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవసరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

నిజానికి మంచి ఎడ్మినిస్ట్రేటర్‌గా చంద్రబాబు గుర్తింపు పొందారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను సిఈవోగా చంద్రబాబును పిలిచేవారు. ఇప్పుడు ఆయన ఎదుట రోల్‌ మోడల్‌ లాగా కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

శనివారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 20 వేల ఉద్యోగాలను విడతల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా యువతీయువకులను పూర్తిగా అందులో మునిగిపోయేలా చేసి, ఆశలను నెరవేరుస్తున్నట్లు కనిపించాలని చంద్రబాబు అనుకుంటున్నారు.

chandrababu and kcr

వయోపరిమితిని కూడా పెంచడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్‌ సర్కారు వయోపరిమితిని భారీగా సడలిస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఏపీలో గతంలో నిర్వహించిన డీఎస్సీకి సంబంధించి నియామకాల్ని సత్వరం పూర్తి చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.

'బాబు వస్తే జాబు వస్తుంది' అనే హామీతో దారుణంగా మోసం చేశారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోటరీ చంద్రబాబు మీద తీవ్రమైన విమర్సలు చేస్తోంది. ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో యువత వైయస్సార్ కాంగ్రెసుకు దూరం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+