Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అండమాన్ జైలుకు చంద్రబాబు: షాకింగ్ కామెంట్స్ చేసిన లక్ష్మీ పార్వతి

వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ మాత్రం అవకాశం ఉన్న చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడే లక్ష్మీ పార్వతి తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

చంద్రబాబు విషయంలో

చంద్రబాబు విషయంలో

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకు జైలుకు వెళ్ళే గతి రాసి ఉందని అన్నారు. ఆమె తన భర్త ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో చంద్రబాబు విషయంలో ఆయన ఏం చెప్పేవారో గుర్తు చేసుకున్నారు.తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుపై ఎన్టీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారో లక్ష్మీ పార్వతి తెలియజేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోకముందు చివరి రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారని ఆమె గుర్తు చేశారు .

Recommended Video

    Lakshmi Parvati Says Chandrababu Had Start Bus Journey For Local Body Elections | Oneindia Telugu
    ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో

    ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో

    మళ్లీ తాను అధికారంలోకి వస్తే తాను చంద్రబాబును తప్పకుండా అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని తనతో అన్నట్లు లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద సిట్ విచారణ కొనసాగుతుంది.

    ఈ నేపధ్యంలో చంద్రబాబుకు

    ఈ నేపధ్యంలో చంద్రబాబుకు

    త్వరలోనే ఆ గతి వస్తుందని ఆశిస్తున్నట్లు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఏపీలో గత పాలనపై ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వాస్తవాలన్నీ బయటకు వస్తాయని, త్వరలోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి ముగ్గురూ జైలుకెళ్లడం నేను చూస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పలు మార్లు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా కోర్టు మెట్లెక్కారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+