కలెకర్లతో రెండ్రోజుల భేటీకి చంద్రబాబు రెడీ-టార్గెట్ ఇదే..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో పాలనపై పట్టు సాధించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు వారిని తమ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా మార్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ఈ నెల 5,6 తేదీల్లో కలెక్టర్లతో పాటు ఎస్పీలతోనూ భేటీ కాబోతున్నారు.

ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్ లో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఇవాళ వెల్లడించారు. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. మొదటి రోజు కలెక్టర్లతోను, రెండో రోజు కలెక్టర్లు,ఎస్పిలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 5వ తేదీ ఉదయం 10గం.ల నుండి 11 గం.ల వరకూ కలెక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజుల్లోనూ ఉదయం 10గం.ల నుండి సా.6గం.ల వరకూ కలెక్టర్ల సమావేశం ఉంటుందని స్పెషల్ సిఎస్ సిసోడియా పేర్కొన్నారు.

Chandrababu to hold first collectors meet on aug 5 6 for grip on administration

మరోవైపు రాష్ట్రంలో కీలక అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన చంద్రబాబు.. ఇక పాలనపై పూర్తిగా ఫోకస్ పెట్టబోతున్నారు. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై శ్వేతపత్రాల్ని విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతీ శాఖలోనూ చేయాల్సిన ప్రక్షాళనపై దృష్టిసారించనున్నారు. అంతకంటే ముందు ప్రభుత్వ ప్రాధాన్యాలను కలెక్టర్లకు, ఎస్పీలకు ఆయన వివరించనున్నారు. ప్రతీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముందుగా చేసే పని ఇదే అయినా ఈసారి మాత్రం కూటమి సర్కార్ ఏర్పాటైన రెండు నెలలకు చంద్రబాబు ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు చేసే దిశానిర్దేశం, ఆదేశాలు ఐదేళ్ల పాటు అధికారులకు దిక్సూచిగా పనిచేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+