Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూటమి పాలనకు 100 రోజులు-మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్బబోతున్న చంద్రబాబు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పలు సంక్షేమ పథకాల్లో మార్పులు చేర్పులతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఉన్నాయి. అలాగే చంద్రబాబు కేబినెట్ మంత్రులు కూడా తన శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో వారు నిర్వహిస్తున్న సమీక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలోనే మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు మంత్రులకు చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు. కూటమి 100 రోజుల పాలనలో ఎవరి పనితీరు ఎలా ఉందన్న దానిపై త్వరలో ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తామని చెప్పేశారు. జనసేన మంత్రులకు సంబంధించిన రిపోర్టును ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

Chandrababu to issue progress report of ministers on 100 days rule jsp report to pawan kalyan

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే తమ శాఖలపై పట్టు పెంచుకునే విషయంలోనూ మంత్రులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని వారితో పలుమార్లు నేరుగా చెప్పేశారు. ఇవాళ కేబినెట్ భేటీలో కొందరు ఎమ్మెల్యేల తీరుపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రులపై ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+