ఏపీ కేబినెట్ ప్రక్షాళన-నేడు క్లారిటీ ఇవ్వబోతున్న చంద్రబాబు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఎక్కడ వెనుకబడ్డారు, ఎక్కడ ముందున్నారు, తమ శాఖలపై మంత్రులకు ఉన్న పట్టు ఎంత అనే అంశాలపై ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్టును సీఎం చంద్రబాబు వారికే అందించారు. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో దానిపై చర్చకు సిద్దమయ్యారు. కేబినెట్ ప్రధాన అజెండా పూర్తయిన తర్వాత మంత్రుల పనితీరుపై చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ప్రధానంగా సంక్షేమం కంటే అభివృద్ధి పైనే ఫోకస్ పెట్టిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో దారుణంగా ఉన్న రోడ్లకు రిపేర్లు చేపట్టేందుకు గుంతల్లేని ఏపీ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఇందులోనూ మంత్రులు యాక్టివ్ గా ఉండాలని చంద్రబాబు పదే పదే చెప్పారు. అలాగే పనితీరు విషయంలో మంత్రులు,ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఇప్పటికే పలు సమీక్షలు కూడా చేశారు. వీటి తర్వాత మంత్రుల పనితీరు ఎలా ఉందన్న దానిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ లను వారికి ఇచ్చారు. దీనిపై ఇవాళ చర్చించి తాజా పరిస్ధితి వారికి వివరిస్తారు.

Chandrababu to review ministers progress in today s cabinet meet amid speculation on reshuffle

మరోవైపు ఏపీ కేబినెట్లో మంత్రుల మార్పులు, చేర్పులపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకోనున్న నేపథ్యంలో మరో రెండు, మూడు మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఇందులో నాగబాబుతో పాటు పల్లా శ్రీనివాస్ ను కేబినెట్లోకి తీసుకుని మరో ఇద్దరు ప్రస్తుత మంత్రుల్ని తొలగిస్తారనే ప్రచారం ఉంది. దీంతో మంత్రులు అలర్ట్ గా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా అవినీతి, అసమర్థత కారణాలతోనే కేబినెట్ నుంచి మంత్రుల తొలగింపు ఉంటుందని తాజాగా ఏపీ టీడీపీ ఛీఫ్ పల్లా శ్రీనివాస్ కూడా వెల్లడించారు.

గతంతో పోలిస్తే ఈసారి కేబినెట్ లో మంత్రుల పనితీరుపై చంద్రబాబు చాలా నిశితంగా ఫోకస్ పెట్టారు. దీంతో వారి రిపోర్టుల్ని ఎప్పటికప్పుడు తెప్పించుకోవడంతో పాటు తాజాగా జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు వంటి విషయాల్లో సైతం వారి పని తీరును అంచనా వేశారు. వీరిలో కొందరికి ఇప్పటికే నేరుగా ఫోన్లు చేయడం లేదా పిలిపించి మాట్లాడటం కూడా చేశారు. అయినా పనితీరు మార్చుకోని వారిపై వేటు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+