Chandrababu: రేపు విజయనగరానికి చంద్రబాబు-ఫుల్ షెడ్యూల్ ఇదే...!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (chandrababu) రేపు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు.
జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే HPV వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే ప్రజా వేదికలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

రేపు ఉదయం 09.30 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి 11.10 గంటలకు చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్తారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చిన బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.

Chandrababu to Visit Vizianagaram Launch HPV Vaccine Drive in Cheepurupalli Tomorrow

ఆ తర్వాత 12 గంటలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రారంభిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీఎం రావివలసలో పాల్గొంటారు. తర్వాత ఏపీలో చేపట్టనున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు రావివలసలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పేదలకు పింఛన్ల పంపిణీ చేస్తారు. చివరిగా 3.15 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో బాబు సమావేశమవుతారు. అలా టూర్ పూర్తి చేసుకుని రాత్రి 7 గంటలకు చంద్రబాబు అమరావతి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+