• search

దటీజ్ బాబు! జగన్‌కు చెక్ చెప్పేందుకు మాస్టర్ ప్లాన్, మధ్యలో పవన్ కళ్యాణ్

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   ఒకే దెబ్బకు రెండు పిట్టలు...!

   అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర కేబినెట్ నుంచి తన ఇద్దరు ఎంపీలను ఉపసంహరించడం, ఎన్డీయేలోనే కొనసాగడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టారా? అంటే అవుననే అంటున్నారు.

   చదవండి: బాబు వల్లే కియా వచ్చిందని గొప్పలు, భయపడ్డారు: మాణిక్యాల రావు తీవ్రవ్యాఖ్యలు

   బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో ఢిల్లీలో టీడీపీ ఎంపీలు తమ నిరసనలతో వైసీపీని ఒకింత కార్నర్ చేశారు. దీంతో వైసీపీ రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించింది. కేంద్రంలో ఉండి టీడీపీ ఆందోళనలు ఎలా చేస్తుందని వైసీపీ మలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాయింట్ లాగింది.

   చదవండి: రైల్వే జోన్ ఇవ్వలేం, ఏపీకి మరో షాక్: చేతలెత్తేసిన కేంద్రం, పుండు మీద కారం

   వైసీపీ నోరు మూయించడంతో పాటు

   వైసీపీ నోరు మూయించడంతో పాటు

   ఈ అంశం తెలుగుదేశం పార్టీని ఒకింత ఇరకాటంలో పడేసింది. అప్పటికి సమర్థించుకున్నప్పటికీ.. కేంద్రమంత్రుల రాజీనామాలతో చంద్రబాబు ఒక్క దెబ్బకు అన్న చందంగా వ్యవహరించారని అంటున్నారు. సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కేంద్రమంత్రులుగా రాజీనామా చేయడం ద్వారా వైసీపీ నోరు మూయించడంతో పాటు ఏపీ ప్రజల్లోకి హోదా కోసం తామే చిత్తశుద్ధితో ఉన్నామనే సంకేతాలు పంపించారని అంటున్నారు.

   జగన్‌కు అలా చెక్ పెట్టిన చంద్రబాబు

   జగన్‌కు అలా చెక్ పెట్టిన చంద్రబాబు

   అంతేకాదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు బీజేపీతో వెళ్లే అవకాశాన్ని ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. అందుకే కేబినెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఎన్డీయే నుంచి తప్పుకోలేదని చెబుతున్నారు. అయితే, బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపు టీడీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరమే.

   పక్కా ప్లాన్.. చంద్రబాబు మాస్టర్ ప్లానే వేరు

   పక్కా ప్లాన్.. చంద్రబాబు మాస్టర్ ప్లానే వేరు

   చంద్రబాబు కేబినెట్ నుంచి బయటకు వచ్చి, ఎన్డీయేలోనే కొనసాగుతారని దాదాపు ఎవరూ ఊహించని పరిమాణం అనుకోవచ్చు. రాజకీయాల్లో చంద్రబాబు లెక్కలు వేరుగా ఉంటాయని చెప్పేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు. ఈ విషయంలో తొందరపడకుండా పక్కా ప్లాన్‌తో వ్యవహరించి ప్రత్యేక హోదా క్రెడిట్ కొట్టేయడంతో పాటు జగన్ బీజేపీ దరి చేరకుండా చేశారని అంటున్నారు.

   మధ్యలో పవన్ కళ్యాణ్, జగన్‌కు క్రెడిట్ వచ్చే సమయంలో

   మధ్యలో పవన్ కళ్యాణ్, జగన్‌కు క్రెడిట్ వచ్చే సమయంలో

   ఓ వైపు కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని, తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్లు కొనసాగాయి. అలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్తగా అవిశ్వాసం మాట ఎత్తారు. దీనికి జగన్ సై అనడంతో హోదా విషయంలో వైసీపీ క్రెడిట్ కొట్టేసే పరిస్థితుల్లో.. చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకొని వన్ సైడ్ కాకుండా.. ఇంకా చెప్పాలంటే టీడీపీయే చిత్తశుద్ధి ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

   బయటకు రావడం బీజేపీకి ఆందోళనే

   బయటకు రావడం బీజేపీకి ఆందోళనే

   ఏపీ బీజేపీ నేతలు చెప్పినట్లు టీడీపీ బయటకు వెళ్లిపోతే ఎన్డీయేలోకి వచ్చేందుకు ఇతరులు సిద్ధంగా ఉండి ఉండవచ్చు.. కానీ శివసేన, అకాలీదల్ తర్వాత ఎన్డీయేలో పెద్ద పార్టీ అయిన టీడీపీ అసంతృప్తికి గురైతే అది బీజేపీకి జాతీయస్థాయిలో ఇబ్బందికర పరిణామమని అంటున్నారు. ఇప్పటికే కేబినెట్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎన్డీయే బయటకు పోకుండా బీజేపీకి కూడా అవసరమే అంటున్నారు. జగన్ ఎన్డీయేలో చేరకుండా బాబుకు, జాతీయస్థాయిలో నష్టం జరగకుండా బీజేపీకి అవసరం ఉందని అంటున్నారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Withdrawing its two members from the Union council of ministers this week may be the easiest thing the Telugudesam Party could do, but it just cannot wish the Bharatiya Janata Party away.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more