మెడికల్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్ళిన చంద్రబాబు .. ఓటమి క్రుంగదీసిందా?

Recommended Video

    ఆస్పత్రికి వెళ్ళిన చంద్రబాబు.. ఓటమి బాధ క్రుంగదీసిందా??

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చందరబాబునాయుడు ఏపీ నుండి హైదరాబాద్ కు వచ్చారు . శుక్రవారం మెడికల్ చెకప్ కోసం అమరావతి నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఆయనహైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ కి వెళ్లారు. గచ్చిబౌలి లోని ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌కి ఉదయమే వెళ్ళిన చంద్రబాబుకు సుమారు గంటకు పైగా మెడికల్ చెకప్ జరిగిందని తెలుస్తోంది. కాగా.. చెకప్ అనంతరం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

    కేవలం వ్యక్తిగత సిబ్బందితో ఆస్పత్రికి వెళ్ళిన బాబు చాలా డల్ గా కనిపించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబును బాగా క్రుంగ దీసినట్టు కనిపిస్తున్నాయి.చంద్రబాబు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని టీడీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం జేసీ మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది.

    Chandrababu went to hospital for medical checkup.. depressed with defeat ?

    ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇక వారం రోజుల పాటు విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు టీడీపీ పునాదులు కదిలిపోయేలా ఎన్నడూ లేని విధంగా వచ్చిన ఓటమి బాధ నుండి కోలుకోటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా వుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+