కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక టాస్క్..! తాజా సర్వేల ఎఫెక్ట్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. తాజాగా రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గతేడాది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కూటమి సర్కార్ సద్వినియోగం చేసుకుందా లేక చతికిలపడుతోందా అన్న దానిపై పలు సర్వేలు వచ్చాయి. వీటిలో ప్రభుత్వ పనితీరుకు మంచి మార్కులే పడుతున్నా ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం జనం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. కేబినెట్ భేటీలతో పాటు పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలను అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని, జనంలో ఉండాలని కోరుతూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మాటల్ని లైట్ తీసుకొంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే విషయం తాజా సర్వేలు కూడా కుండబద్దలు కొట్టేశాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీలో కూటమి ఏడాది పాలనపై మరోసారి మంత్రులతో చర్చించిన చంద్రబాబు.. అనంతరం కీలక నిర్ణయం ప్రకటించారు. జూలై 1 నుంచి ఎన్డీయే ఎమ్మెల్యేల్ని జనంలోకి పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు కూటమి సర్కార్ ఏడాది పాలన విజయాల్ని జనంలోకి తీసుకెళ్లి వివరించాలని వారిని కోరబోతున్నారు. ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా దాన్ని చెప్పుకోవడంలో విఫలమైతే ప్రజలు ఆదరించరనే విషయాన్ని గుర్తించాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచిస్తున్నారు. కాబట్టి జూలై 1 నుంచి ఎమ్మెల్యేలను జనంలోకి పంపడానికి వీలుగా కొత్త కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించబోతున్నారు.

తాజా సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఎక్కువగా ఆరోపణలు రావడం, తాను చేయిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేల్లో సైతం ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తుండటంతో ముందుగా ప్రక్షాళన వారి నుంచే మొదలుపెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి అదే ప్రజల వద్దకు వెళ్లి తాము చేసిన మంచి పనుల్ని చెప్పుకునేలా, అలాగే ప్రభుత్వం విజయాల్ని సైతం వివరించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications