చంద్రగిరి పరిషత్ ఎన్నికల్లో ఆసక్తికరపరిణామం.. చెవిరెడ్డికి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి దిమ్మతిరిగే షాక్!
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ ఆసక్తికరమైన, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రశాంతంగా పోలింగ్ జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో చెవిరెడ్డి తిరుగుతుండగా సుధారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగనివ్వాలని, టీడీపీ నేతలను అనవసరంగా రెచ్చగొట్టవద్దని నేరుగా చెవిరెడ్డికే సూచించారు. "పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు కలిసి వెళ్దాం. అవసరమైతే నేతలతో కలిసి ఒకే కారులో వెళ్దాం" అని ఊహించని షాక్ ఇచ్చారు. చెవిరెడ్డి ఎటువైపు వెళ్తే అటువైపే వెళ్తానని, కారు తీసుకురమని కూడా అన్నారు.

సుధారెడ్డి సూచనలు, ఆమె తీరుతో చెవిరెడ్డి కంగుతిన్నారు. సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. సుధారెడ్డి మాత్రం అతని వెనుకే వెళ్లి "అన్నకు కుర్చీ వేయండి" అంటూ ఫాలో అయ్యారు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అవ్వడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి.చంద్రగిరి నియోజకవర్గం గతంలో చెవిరెడ్డి కుటుంబం ప్రభావం కలిగిన ప్రాంతం. 2014, 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పులివర్తి నాని టీడీపీ తరఫున పోటీ చేసి చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సుధారెడ్డి ఈ ఘటనలో ప్రశాంత పోలింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించింది. ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టకుండా, ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా చూడాలని ఆమె సూచించారు.
చెవిరెడ్డి వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. అయితే ఈ సంఘటన చంద్రగిరి రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది.పరిషత్ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఓటర్లను ఆలోచించేలా చేస్తున్నాయి. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఈ ఘటన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.












Click it and Unblock the Notifications
