ధన త్రయోదశి నుంచి ధనుస్సు, సింహం, తుల, మేష రాశుల పంట పండింది

ధనత్రయోదశి పర్వదినం వేళ గ్రహాల నడకలో అరుదైన మార్పు చోటుచేసుకోబోతోంది. బుధ, శుక్ర గ్రహాల కలయికతో ఎంతో శక్తివంతమైన 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడనుండటంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి సంపద, ఐశ్వర్యం లభించడమే కాకుండా, పట్టిందల్లా బంగారమే కానుందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా అత్యంత శుభఫలితాలు పొందబోతున్న ఆ రాశులేవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
మకర రాశి, కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రాజయోగం అద్భుతమైన టైంను తీసుకొస్తోంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వివాదాలు, కోర్టు చిక్కుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. వీరి ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్తగా ప్రారంభించే ఏ పనిలోనైనా ఆశించిన లాభాలు అందుతాయి.

తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
తుల, వృశ్చికం, ధనుస్సు రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
Horoscope Starting from Dhanatrayodashi fortune smiles upon those born under the signs of Sagittarius Leo Libra and Aries

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారింది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి పురోగతి, ఆశించిన లాభాలు సాధిస్తారు. అయితే, ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ యోగం ఆర్థిక బలాన్ని అందిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగుపడుతుంది.చాలా రోజులుగా వాయిదా పడుతున్న కలలు, కోరికలు ఇప్పుడు సులభంగా నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది, దంపతుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

మేష రాశి

మేష రాశి వారి జాతకంలో అదృష్టం రెట్టింపు కాబోతోంది. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఊహించని రేంజ్‌లో విజయాలు అందుకోవడం ఖాయం. వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న చిక్కులు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి భాగస్వామి లభించే అవకాశాలు ఉన్నాయి. చేసే పనులపై కాస్త దృష్టి సారిస్తే అద్భుత ఫలితాలు అందుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+