పథకాల లబ్దిదారుల ఎంపికలో కీలక మార్పులు, రేషన్ కార్డు కాదు.. ఈ కార్డు ఉంటేనే అర్హత..!!
సంక్షేమ పథకాల లబ్దిదారులకు బిగ్ అప్డేట్. ఇప్పటి వరకు ఆధార్... రేషన్ కార్డు ఆధారంగా పథకాల లబ్దిదారులకు ఎంపిక చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంది. ఆధార్ గుర్తింపు కార్డుగా అనుమతించారు. కాగా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ పథకాల లబ్ది దారుల గుర్తింపు విషయంలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. ఇక నుంచి రేషన్, ఆధార్ కార్డుల స్థానంలో కొత్తగా ఓటరు ఐడీ ఉంటేనే ఈ పథకాలు అందే విధంగా మార్పులకు రంగం సిద్దం చేస్తున్నారు.
పథకాల అమలు విషయంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సంచలనంగా మారుతోంది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌కార్డుకు బదులుగా ఓటరు గుర్తింపు కార్డును ప్రామా ణికంగా తీసుకోనున్నట్టు కేంద్ర మంత్రి లలన్ సింగ్ ప్రకటించారు. లబ్ధిదారులు తమ ఓటరు గుర్తింపు కార్డు నంబర్(ఈపీఐసీ)తో పాటు బయోమెట్రిక్ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. లబ్ధిదారులకు చెల్లింపులు చేయడానికి ఇకపై ఆధార్‌ను ప్రామాణికంగా పరిగణించ బోమని పేర్కొన్నారు. ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థలు దాదాపు ప్రతి ప్రాంతంలో అందుబాటు లో ఉన్నాయని, ఐదు నిమిషాల్లోనే ఎవరికైనా ఆధార్ కార్డు సృష్టించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్‌కు బదులుగా ఓటరు కార్డు నంబర్, బయోమెట్రిక్ వివరాలను ఉపయోగిస్తామని చెప్పారు.

కేంద్రం తాజా ప్రతిపాదనల పై చర్చ
దీంతో, ఇప్పుడు ఈ ఆలోచన అమలు పైన చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఆధార్ ఆధారంగా జరుగుతున్న నగదు చెల్లింపులకు బదులుగా ఇకపై ఓటరు కార్డుతో పాటు బయోమెట్రిక్ ధ్రువీ కరణను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. నకిలీ లబ్ధిదారులను ఏరివేసి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులకే అందించడమే లక్ష్యమని చెబుతున్నారు. అయితే ఓటరు జాబితాలపై రాజకీయ వివాదాలు కొనసాగుతున్న వేళ ఈ ప్రతిపాదన కొత్త చర్చకు తెరలేపుతోంది. ఈపీఐసీ నంబర్‌తో బయోమెట్రిక్ వివరాలను జతచేయడం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించవ చ్చని, అనర్హుల పేర్లను తొలగించి ప్రభుత్వ సాయం అర్హులకే అందించవచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఓటరు జాబితాల్లో పేర్ల తొలగింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న 'ఓటు చోరీ' ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రతిపాదన... అమలు పైన రాజకీయంగానూ ఆసక్తి కర చర్చ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
