చంద్రయాన్ 3తో దేశం గర్వపడేలా చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు: తెలంగాణా గవర్నర్ తమిళిసై!!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేసిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు చంద్రయాన్ 3 సక్సెస్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

ఇది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని, అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన రోజు అని, అంతరిక్ష విజ్ఞానంలో మరో మైలురాయిని భారతదేశం చేరుకుందని పేర్కొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ మేరకు ఆమె తన మాతృభాష అయిన తమిళంలో ట్వీట్ చేశారు.

chandrayan3tamilasai

చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మన భారతదేశం యొక్క గర్వం ప్రపంచ వేదికపై ప్రతిష్టించబడుతుంది అని తమిళి సై పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అయిన చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారతదేశం గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు.

చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక అభివృద్ధికి సహకరించిన శాస్త్రవేత్తలు సిబ్బంది మాత్రమే కాకుండా, దీని వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం చేసి దేశ ప్రతిష్టను ఇస్రో శాస్త్రవేత్తలు మరింత పెంచారని తమిళి సై వారిని కొనియాడారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై స్పందించిన ఇస్రో చీఫ్ సోమనాథ్ చంద్రయాన్ 3 క్రాఫ్ట్ తో భూమి చుట్టూ ఉన్న నిర్ణీత కక్షలోకి ప్రవేశించడంతో ఆయన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు .ఇలాగే విజయవంతంగా చంద్రయాన్ 3 చంద్రుని చేరుకోవాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+