మంత్రి శత్రుచర్లపైకి చెప్పులు: బిజెపి సమావేశానికి సెగ

కాగా, శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలిలో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం ఉదయం మంత్రి శత్రుచర్ల చేపట్టిన బైక్‌ర్యాలీని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో బిజెపి సమావేశాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమావేశంలో కుర్చీలు ధ్వంసం చేశారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుపై ఆందోళనకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హరిబాబు స్వల్పంగా గాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ఏపీఎన్జీవోల పిలుపు మేరకు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓడల రేవు ఓఎన్జీసీ జేసీఎస్ ముట్టడికి 15వేల మంది సమైక్యవాదులు యత్నించారు. గేట్ల ధ్వంసానికి యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోనికి వెళ్తున్న కార్మికులను సమైక్యవాదులు అడ్డుకోవడంతో సివిల్ వర్క్స్, చమురు శుద్ధి పనులు నిలిచిపోయాయి.
విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ఉదయం నక్కపల్లి దగ్గర జాతీయరహదారిపై సమైక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కోరవురట్లలో సమైక్యాంధ్ర కోసం శాంతి హోమం నిర్వహించారు. పోస్టాఫీసు, ఆర్ఎంసీ కార్యాలయాలకు ఏపీఎన్జీవోలు తాళాలు వేసి నిరసన తెలిపారు.
విభజనకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం తాళ్లపూడిలో విద్యార్థి కోలాట గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications