వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకాశం జిల్లా జడ్పీ డూప్లికేట్ వెబ్ సైట్ సూత్రధారుల అరెస్ట్...31 లక్షల నగదు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా: ఛీటింగ్ చేయడంలో కూడా క్రియేటివిటీ చూపించి ప్రకాశం జిల్లా పరిషత్ పేరిట నకిలీ వెబ్ సైట్ ను సృష్టించి నిరుద్యోగులను కొల్లగొట్టిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఎస్పీ ఆదేశాలతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నమార్కాపురం పోలీసులు చెప్పినట్లే రోజుల వ్యవధిలోనే ఆ జగత్ కిలాడీలను పట్టేశారు

ప్రకాశం జిల్లా జడ్ పి కార్యాలయం పేరుతోనే నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయని ప్రకటనలు గుప్పించి నిరుద్యోగులను మోసగించిన కేసులో ఈ ఛీటింగ్ రాకెట్ కు ప్రధాన సూత్రధారి అయిన షేక్ ఖాసిమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడితో పాటు ఈ ఛీటింగ్ వ్యవహారంలో భాగస్వాములైన మరో 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 31 లక్షల రూపాయల నగదు, డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

cheaters arrested fakes govt website, cheats hundreds Of job aspirants

చాపకింద నీరులా నిరుద్యోగులను మోసగించుకుంటూ సాగిపోతున్న ఈ ఛీటింగ్ రాయుళ్ల వ్యవహారం ముందు జడ్పి సిఈవో గుర్తించి ఎస్పికి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఎస్పీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని మార్కాపురం పోలీసులకు దిశానిర్ధేశం చేశారు. డిఎస్పి, మార్కాపురం సిఐ ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్లిష్టమైన ఈ కేసును చేధించడమే కాదు వారు అమాయకులైన నిరుద్యోగుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైతం రికవరీ చేయడం ఎంతగానో అభినందించదగ్గ విషయమని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం

English summary
prakasam district:The prakasam district zp fake web site creater arrested in markapuram. The police also detained 10 more people involved in this cheating case. Of these, 31 lakh rupees cash and documents were seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X