రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు నిజంగా ఫీలింగ్స్ వస్తాయా? నిజాలు చెప్పిన నటి!
సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లలో వచ్చే రొమాంటిక్, బోల్డ్ సీన్లను చూసి ప్రేక్షకులు తెరపై కనిపించే నటీనటుల మధ్య నిజంగానే కెమిస్ట్రీ లేదా ఫీలింగ్స్ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. అయితే, ఈ విషయాలపై ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అర్చనా శాస్త్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన నిజాలను వెల్లడించారు. "బోల్డ్ సీన్లు చేస్తున్నప్పుడు అక్కడ ఫీల్ అవ్వడానికి ఎలాంటి స్కోప్ ఉండదు" అని అర్చన స్పష్టం చేశారు.
చుట్టూ వందల మంది.. ఆ వాతావరణంలో ఫీలింగ్స్ రావు
షూటింగ్ సమయంలో తెర వెనుక ఉండే వాతావరణాన్ని అర్చన వివరిస్తూ.. "మనం ఒక సీన్ చేస్తున్నప్పుడు సెట్‌లో మన చుట్టూ ఎంతో మంది సిబ్బంది ఉంటారు. అంత మంది మధ్యలో రొమాంటిక్ ఫీలింగ్స్ రావడం అస్సలు సాధ్యం కాదు. అది కేవలం ఒక సీన్ మాత్రమే. అక్కడ నేను ఒక ఆబ్జెక్ట్, నాతో నటించే వ్యక్తి మరొక ఆబ్జెక్ట్ లాంటివాడు. అంతకుమించి అక్కడ ఎలాంటి భావోద్వేగాలకు తావుండదు" అని ఆమె పేర్కొన్నారు. ఒక సీన్ పూర్తయిన వెంటనే అది బాగా వచ్చిందా లేదా అని తానే స్వయంగా డైరెక్టర్‌ను అడుగుతానని.. అవసరమైతే మరో టేక్ చేద్దామా అని కూడా అడుగుతానని నెహల్ చెప్పారు.

సరిగ్గా చేయకపోతే థియేటర్లలో నవ్వుకుంటారు..
రొమాంటిక్ సన్నివేశాలను పర్‌ఫెక్ట్‌గా చేయకపోతే వచ్చే ఇబ్బందులను కూడా ఆమె ప్రస్తావించారు. "థియేటర్లలో ప్రేక్షకులు పూర్తి నిశ్శబ్దంతో సినిమా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ వచ్చేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ సీన్‌ను నటీనటులు సరిగ్గా పండించలేకపోతే.. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. అంతేకాదు, థియేటర్లలో జనాలు చూసి నవ్వుకుంటారు. అందుకే నటీనటులపై ఆ సీన్ బాగా చేయాలనే ఒత్తిడి ఉంటుంది తప్ప వేరే ఆలోచనలు రావు" అని నటి అర్చన వివరించారు.
తడి బట్టలతో బోల్డ్ సీన్స్ చేసినా ఏమీ అనిపించదు
యాంకర్ స్పందిస్తూ.. 'కమలతో నా ప్రయాణం' సినిమాలో నది ఒడ్డున తడి బట్టలతో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కంప్లీట్ రొమాంటిక్ సీన్లను ప్రస్తావిస్తూ, ఒక మనిషిగా అంతలా నటించేటప్పుడు కేవలం యాక్టింగ్ మాత్రమే చేయడం సాధ్యమేనా? అని ఆమెను ప్రశ్నించారు. దానికి అర్చన బదులిస్తూ.. "ఖచ్చితంగా సాధ్యమే. ఆ సమయంలో 'యు ఫీల్ నథింగ్' (మనకు ఏమీ అనిపించదు). నేను కూడా ఆ సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ చేశాను. అలాంటి సీన్లు చేసేటప్పుడు కేవలం ఇబ్బంది మాత్రమే ఉంటుంది. అంత మంది ముందు అలా నటించాల్సి వచ్చినప్పుడు ఉండే ఆ అసౌకర్యం తప్ప, మనసులో ఎలాంటి శృంగార భావాలు కలగవు" అని అర్చనా శాస్త్రి తెర వెనుక ఉన్న అసలు సత్యాన్ని విడమరిచి చెప్పారు.












Click it and Unblock the Notifications