శుభవార్త.. ఆ కేంద్రమంత్రి చొరవతో చెన్నై-విజయవాడ వందేభారత్ ఆ జిల్లా వరకు పొడిగింపు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో రైల్వే పోషిస్తున్న పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి. ఏపీలో వందే భారత్ రైళ్లతో, కొత్త రైల్వే లైన్లతో ఏపీ రైల్వే వ్యవస్థను పరిపుష్ఠం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా హై ఫై వసతులతో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. ఇక తాజాగా ఏపీ వాసులకు వందే భారత్ విషయంలో మరో శుభవార్త చెప్పింది.
ఏపీకి మరో శుభవార్త చెప్పిన రైల్వే
ఇప్పటికే ఇప్పటికే విశాఖ వందే భారత్ కు సామర్ల కోటలో హాల్టింగ్ ఇచ్చింది. సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ కు ఏలూరులో హాల్టింగ్ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ఆ ప్రాంత వాసులకు వందే భారత్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో రూట్లో కూడా వందే భారత్ రైలును పొడిగించి శుభవార్త చెప్పింది.

పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు పండుగ లాంటి వార్త
పశ్చిమగోదావరి జిల్లా వాసులకు పండుగ లాంటి విషయాన్ని చెప్పింది రైల్వే శాఖ. నరసాపురం ప్రజల చిరకాల కోరికను నెరవేర్చడానికి నిర్ణయం తీసుకుంది. నరసాపురం చెన్నై మధ్య వందే భారత్ రైలు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. నరసాపురం రైల్వే స్టేషన్ లో అందుకు తగినట్టుగా శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు అనుమతి వచ్చిన వెంటనే నరసాపురం చెన్నై మధ్య వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది.
అక్కడివరకు వందేభారత్ రైలు పొడిగింపు
ప్రస్తుతం చెన్నై- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు విజయవాడలో ఎక్కువసేపు ఉంటుంది. ఈ రైలును విజయవాడలో ఎక్కువసేపు ఉంచడం వల్ల మిగిలిన రైళ్లకు ఇబ్బందిగా మారుతుంది. ప్లాట్ ఫాం లు ఖాళీ లేక అనేక రైళ్ళ సమయాలు మారుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ వందేభారత్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తే అక్కడి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తుంది.
చెన్నై- విజయవాడ వందే భారత్ రైలు పొడిగింపుపై రకరకాల ఆలోచనలు
అదేవిధంగా విజయవాడలో ఈ రైలు కారణంగా కలుగుతున్న ఇబ్బందికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్న రైల్వే శాఖ ఆలోచన చేస్తుంది . ఈ వందే భారత్ రైలును మొదటి భీమవరం వరకు పొడిగించాలని భావించిన ఆ ఆలోచనను విరమించుకుంది. భీమవరంలో ఈ రైలును ఆపితే బోగిలలో నీళ్లు నింపడానికి అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని విరమించుకొని, మచిలీపట్నం వరకైనా పొడిగించాలని ఆలోచించింది.
కేంద్ర మంత్రి చొరవతో అక్కడివరకు వందేభారత్
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ, కేంద్రమంత్రి కావడంతో ఆయన నరసాపురం వరకు వందే భారత్ ను పొడిగిస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏలూరు మీదుగా వందే భారత్ నడుస్తుందని, నరసాపురం వైపు కూడా వందే భారత్ నడిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
వందే భారత్ రాక కన్ఫర్మ్ కావటంతో శరవేగంగా స్టేషన్లో పనులు
దీనిపైన రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడంతో నరసాపురానికి వందే భారత్ రైలు రావడం కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే వందే భారత్ రైలు నరసాపురం వరకు కొనసాగితే కావాల్సిన మౌలిక సదుపాయాల పైన దృష్టి పెట్టి నరసాపురం రైల్వే స్టేషన్లో పనులు చేస్తున్నారు . రైళ్లకు నీటిని నింపే పైప్లైన్ పనులు చేపట్టారు. దాదాపు 70 శాతం ఈ పనులు పూర్తయినట్టు గా తెలుస్తుంది.
ఇకపై చెన్నై- విజయవాడ- నరసాపురం వందే భారత్
అలాగే ట్రాక్ ని పటిష్టంగా ఉంచడానికి కూడా పనులు చేస్తున్నారు. విజయవాడలో ఎన్ని ఎక్కువ గంటలు ఖాళీగా ఉంటున్న ఈ రైలును ఇప్పుడు వరకు పొడిగించి, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ విజయవాడకు వచ్చేలా ప్లాన్ చేయనున్నారు. ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత వందే భారత్ రైలు చెన్నై - విజయవాడ- నరసాపురం, నరసాపురం- విజయవాడ- చెన్నై వరకు దూసుకుపోనుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications